2016లో స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరి మన్ననలు పొందింది. '
ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయటం వింతా కాదు..విశేషం అంతకన్నా కాదు.అది ఇండస్ట్రీలో రొటీన్ గా జరుగుతూంటాయి. అయితే ఆ విశేషాలు విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ హీరో చేసి ఉంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది. అలాంటి విశేషమే ఒకటి రీసెంట్ గా బయిటకు వచ్చింది. అదేమిటంటే...
రామ్ చరణ్ కెరీర్ లో 'ధృవ'చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలసిందే. 2016లో స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరి మన్ననలు పొందింది. 'గోవిందుడు అందరివాడేలే' 'బ్రూస్ లీ: ది ఫైటర్' వంటి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో వెనుకబడిపోయిన చెర్రీ కెరీర్ కి ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ మూవీ తమిళ్ లో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రానికి అఫీషియల్ రీమీక్. అయితే ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీ టాపీక్ ఎందుకంటారా...ఈ సినిమా కథను మొదట ప్రభాస్ కోసం రాసుకున్నారట దర్శకుడు మోహన్ రాజా.
తమిళ ఒరిజనల్ 'తని ఒరువన్' దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ...నేను మొదట ఈ కథను ప్రభాస్ కోసం రాసుకున్నాను. కానీ అప్పుడు ప్రభాస్ లవ్ స్టోరీ చేద్దామని అన్నారు. దాంతో వేరే దారి లేక జయం రవితో ఈచిత్రం చేయటం జరిగింది అని చెప్పుకొచ్చారు. ఆ 'తని ఒరువన్' చిత్రమే తమిళంలో హిట్టై తెలుగులో ధృవ చిత్రంగా మన ముందుకు వచ్చిందన్నమాట. అదే ప్రభాస్ తో చేసి ఉంటే తమిళ,తెలుగు చేసి ఉందరు. మరి రిజల్ట్ ఏ స్దాయిలో ఉండేదో.
'జయం' రవి హీరోగా, ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తని ఒరువన్'. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఈ మూవీ 2015 ఆగస్టు 28న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం 'తని ఒరువన్' సీక్వెల్ కు శ్రీకారం చుట్టబోతున్నారు.
జయం రవి 'తని ఒరువన్ 2' చిత్రాన్ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారు? వేరే నటీనటులతో సెట్స్ మీదకు తీసుకెళ్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలానే తెలుగులో రామ్ చరణ్ తో 'ధృవ 2' సినిమా ఉంటుందా లేదా?.. ఒకవేళ 'ధృవ' కి సీక్వెల్ చెయ్యాలని భావిస్తే, సురేందర్ రెడ్డి - మోహన్ రాజాలలో ఎవరు దర్శకత్వం వహిస్తారు? అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటన్నింటిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
