Asianet News TeluguAsianet News Telugu

రామ్‌చరణ్‌ కూతురికి రాత్రి కూడా ఫుల్‌ సెక్యూరిటీ.. ఉపాసన ఐడియా మామూలుగా లేదుగా!

రామ్‌చరణ్‌, ఉపాసన కూతురు క్లీం కార కొణిదెల ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఆ చిన్నారికి సంబంధించిన ప్రతిదీ హాట్‌ టాపిక్‌ అవుతుంది.  తాజాగా ఓ పోస్ట్ అందరిని ఆశ్యర్యపరుస్తుంది.

ram charan daughter klin kaara in safe hands at nights upasana plan super arj
Author
First Published Jul 17, 2023, 10:25 PM IST

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసనలు ఇటీవల పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నేషనల్‌ వైడ్‌గా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మీడియా ఐస్‌ మొత్తం వీరి పాపపైనే ఉంది. దీంతో పుట్టుకతోనే సెలబ్రిటీ హోదాని పొందుతుంది చరణ్‌-ఉపాసనల కూతురు క్లీంకార కొణిదెల. ఈ చిన్నారికి సంబంధించిన ప్రతి మూవ్‌మెంట్‌ చర్చనీయాంశంగానే మారుతుంది. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడం, ఇంట్లో 21డేస్‌ పండగ, పేరు నిర్ణయించడం, ఆమె గది డెకరేషన్‌.. ఇలా ప్రతిదీ ప్రత్యేకమే. ప్రతిదీ ఓ సెలబ్రేషనే అనేట్టుగా సాగుతుంది. 

ఒక పాప పుట్టుక ఇంతటి సెలబ్రేషన్‌గానూ మారడం బహుశా మన వద్ద ఇదే మొదటిసారి కావచ్చు. మెగాస్టార్‌ మనవరాలు కావడం, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూతురు కావడం దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆ చిన్నారి రూమ్‌ని సెపరేట్‌గా డెకరేట్‌ చేయించారు. ఫారెస్ట్ లా ఆర్ట్స్ గియించి గోడలకు అంటించారు. తను ఆ ప్రకృతిని చూసేలా వాళ్లు ఈ ప్రత్యేకమైన డిజైన్‌ చేయించారు.  అందుకోసం భారీగా ఖర్చు చేయడం విశేషం. మరోవైపు ముఖేష్‌ అంబానీ ఏకంగా బంగారు ఉయ్యాల పంపించారు. ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. 

ఇప్పుడు మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. క్లీంకారకి రామ్‌చరణ్‌ దంపతులు ఫుల్‌ సెక్యూరిటీ పెట్టారు. రాత్రి సమయాల్లో కూడా తన కూతురుని కంటికి రెప్పలా చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. క్లీంకార బిగ్ బ్రదర్ ఇప్పుడు క్లీంకార సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యం రాత్రిళ్లు కంటికి రెప్పాలా కాపాడుకుంటున్నాడు. చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని రామ్‌చరణ్‌ దంపతులు తెలిపారు. వీరికి రైమ్‌ అనే చిన్న పెంపుడు కుక్క ఉన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా దీన్ని పెంచుకుంటున్నారు రామ్‌చరణ్‌ దంపతులు. తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. 

అయితే ఇప్పుడు రైమ్‌కి పెద్ద బాధ్యతలు అప్పగించారు. చిన్నారి క్లీంకారని రాత్రిళ్లు చూసుకునే బాధ్యతలు అప్పగించారట. రాత్రి సమయంలో సోఫాపై నిల్చొని క్లీంకార పడుకున్న కాట్‌ని చూస్తుంది రైమ్‌. దీన్ని ఫోటో తీసి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో పేర్కొంటూ, `నా చెల్లెలు నైట్‌ డూటీపై ఓ కన్ను వేచి ఉన్నాను` అని క్యాప్షన్‌ పెట్టారు. రైమ్‌ తన భావాలను చెబుతున్నట్టుగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. చాలా ఫన్నీగా మార్చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 

ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం `గేమ్‌ చేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో జరుగుతుంది. విలన్‌ ఎస్‌ జే సూర్యల మధ్య ఫైట్‌ సీక్వెన్స్ తీస్తున్నారట. 

 

Follow Us:
Download App:
  • android
  • ios