మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ తో ఆయన ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. నార్త్ లో ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ చుట్టుముట్టేస్తున్నారు. ఇక రీసెంట్ గా జవాన్ల క్యాంపులో రామ్ చరణ్ సందడి చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ తో ఆయన ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. నార్త్ లో ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ చుట్టుముట్టేస్తున్నారు. ఇక రీసెంట్ గా జవాన్ల క్యాంపులో రామ్ చరణ్ సందడి చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రేంజ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో చరణ్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. మెగా హీరో యాక్టింగ్ కు బీటౌన్ జనాలు ఫిదా అయ్యారు. నార్త్ లో ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. దీనికి బెస్ట్ ఎక్జాంపుల్ రామ్ చరణ్ పంజాప్ టూర్. ప్రస్తుతం చెర్రీ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక మిగిలిన షూటింగ్ లో మేజర్ పార్ట్ మూవీ షూటింగ్ ను పంజాబ్ లోని అమృత్ సర్ లో ప్లాన్ చేశారు. కొంత కాలంటా అక్కడే ఉంటూ.. షూటింగ్ లో బిజీ అయిపోయాడు చరణ్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం కొంత కాలంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్నాడు రామ్ చరణ్. అక్కడ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు.
చరణ్ ను కలవడానికి సామాన్యులతో పాటు విఐపీలు సైతం ఎగబడుతున్నారు. ఇక ఈ క్రమంలో మంగళవారం షూటింగ్ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లతో గడిపారు.ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతే కాదే జవాన్లతో కలిసి దిగిన ఫోటోస్ ను కూడా శేర్ చేశారు రామ్ చరణ్. ఈ సందర్భంగా రామ్ చరణ్ పోస్ట్ లో ఇలా రాశారు.
ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అంత కాదు జవాన్లతో కలిసి బోజనం కూడా చేశారు మెగా పవర్ స్టార్. నార్త్ లోరామ్ చరణ్ క్రేజ్ కు ఇక్కడి ప్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక ట్రిపుల్ ఆర్ తో చరణ్ కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రాజమౌళి డైరెక్షన్ లో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ మెప్పించారు. ఆయన జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించారు. ఇక ఈమూవీలో కొమురం భీమ్ పాత్రలో చరణ్ తో స్క్రీన్ శేర్ చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మార్చ్ 25న రిలీజ్ అయిన ఈమూవీ వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ దాటుకుని పరుగులు తీస్తోంది.
