వంద కోట్లకుగాపై బడ్జెట్‌తో రూపొందిన ఆచార్య సినిమా కేవలం వరల్డ్ వైడ్‌గా అతి తక్కువ కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా విషయంలో నిర్మాతలకు ఎదురైన నష్టాలను భరించడానికి తమ రెమ్యునరేషన్స్‌ను చిరంజీవి, రామ్‌చరణ్ వదులుకున్నారు.
ఎంత పెద్ద స్టార్స్ అయినా ప్రతీ సినిమా మొదటి సినిమా అన్నట్లు కష్టపడాల్సిందే. ఆ సినిమా వందశాతం సక్సెస్ సాధిస్తుంది అన్న నమ్మకంతోనే టీమ్ మొత్తం కోసం కష్టపడతారు. కానీ ఒక్కోసారి ఆడియన్స్ అభిరుచి నేపధ్యంలో అంచనాలను అందుకోలేక బోల్తాపడుతూంటారు. ఎంతో కష్టపడి తెరకెక్కించినా కూడా కొన్ని చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోతుంటాయి. అలా ఈ మధ్యన భారీ పరాజయాన్ని ఎదుర్కున్న సినిమాల్లో 'ఆచార్య' కూడా ఒకటి. కొరటాల శివ సినిమా అంటే ఒక సోషల్ మెసేజ్‌తో తెరకెక్కే మాస్ సినిమా అని పేరు. కానీ ఆచార్య తన లెక్కలన్నింటిని మార్చేసింది. చిరంజీవి, రామ్ చరణ్‌లాంటి ఇద్దరు మెగా హీరోలు మల్టీ స్టారర్ చేసినా కూడా ఎందుకో ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
చివరకు వెండితెరపై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన ఆచార్య బుల్లితెరపై డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆచార్య సినిమా స్పెషల్ ప్రీమియర్ ఇటీవల జెమినీ టీవీలో ప్రసారమైంది. చిరంజీవి, రామ్‌చరణ్ (Ram charan) తొలిసారి కలిసి నటించిన సినిమా కావడంతో టీఆర్‌పీ రేటింగ్స్ బాగానే వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. ఈ సినిమాకు కేవలం 6.30 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే దక్కించుకున్నది.వంద కోట్లకుగాపై బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం వరల్డ్ వైడ్‌గా అతి తక్కువ కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా విషయంలో నిర్మాతలకు ఎదురైన నష్టాలను భరించడానికి తమ రెమ్యునరేషన్స్‌ను చిరంజీవి, రామ్‌చరణ్ వదులుకున్నారు. ఆచార్య సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది.
ఇది ఊహించని పరాజయం. చిరంజీవి ముందుగా తేరుకుని స్పందించారు.ఆవేదనలో ఈ ఫెయిల్యూర్ గురించి చిరంజీవి రెండుమూడు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రామ్ చరణ్ మాత్రం ఇంతకాలం ఆ టాపిక్ పై స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ తాజాగా పరోక్షంగా ఆచార్య డిసాస్టర్ గురించి కామెంట్స్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హిందుస్థాన్ టైమ్స్ ఏటా నిర్వహించే లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న చరణ్.. ఆచార్య సినిమా పేరెత్తకుండా దాని గురించి మాట్లాడాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ... RRR భారీ సక్సెస్ అయ్యాక తన నుంచి ఒక స్మాల్ రిలీజ్ జరిగిందని.. అందులో తాను గెస్ట్ రోల్ లాంటిది చేశానని.. కానీ ఆ సినిమా చూసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని చరణ్ కామెంట్ చేసాడు. ప్రేక్షకులు కంటెంట్ బాగుంటేనే చూస్తారు, థియేటర్లకు వస్తారు అనడానికి ఇది రుజువని.. విషయం లేకుంటే ఎలాంటి హీరో నటించినా చూడరని చరణ్ చెప్పుకొచ్చాడు.
ఇక అదే కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్‌లో తన ఇంట్రో సీన్‌కు పడ్డ కష్టం గురించి వివరించాడు. ఆ సీన్ చిత్రీకరణకు 35 రోజులు పట్టిందని.. చిన్నతనంలోనే డస్ట్ అలర్జీ కారణంగా సర్జరీ కూడా చేయించుకున్నానని.. అలాంటి వాడిని విపరీతమైన దుమ్ము, వేల మంది మనుషుల మధ్య 35 రోజుల పాటు ఈ సినిమా కోసం కష్టపడాల్సి వచ్చిందని.. ఆ సన్నివేశం అద్భుతంగా రావడానికి రాజమౌళే కారణమని చరణ్ అభిప్రాయపడ్డాడు.
