`ఆచార్య` సినిమాలోని `భలే భలే బంజారా` పాటతో మెగా ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇవ్వబోతున్నారు చిరంజీవి, రామ్‌చరణ్. వీరిద్దరు కలిసి డాన్సు చేయబోతున్నారు. అది మామూలు డాన్సు కాదట.
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుంది. రామ్‌చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్‌పై మిశ్రమ స్పందన కూడా వినిపించింది. సంతృప్తికరంగా లేదనే టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే సినిమా ఈ నెల 29న విడుదల కాబోతున్న విసయం తెలిసిందే. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచింది యూనిట్. వరుసగా ట్రీట్‌లిస్తుంది. ఈ సినిమా నుంచి మరో పాటని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా మరో పాటని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్. ఈ నెల 18న(సోమవారం) `భలే భలే బంజారా` అంటూ సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఇందులో చిరంజీవితోపాటు రామ్‌చరణ్ కూడా స్టెప్పులేయబోతుండటం విశేషం.
ఇదిలా ఉంటే ఈ పాటకి సంబంధించి ముందస్తు చర్చల వీడియోని పంచుకుంది యూనిట్. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌తోపాటు కొరటాల శివ ఉన్నారు. `భలే భలే బంజారా` సాంగ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌తో స్టెప్పులేయించబోతున్నట్టు తెలిపారు కొరటాల శివ. అయితే ఇటీవల `నాటు నాటు` పాటతో చరణ్ ఇరగ్కొట్టాడు. ఆయనతో నేను పోటీ పడగలనా అని చిరంజీవి టెన్షన్ పడుతున్నట్టు కనిపించారు. అంతేకాదు తమ ఇద్దరు డాన్సు చేస్తుంటే సురేఖ చూడాలనుకుంటుందట. అందరి ముందు డాన్సు చేయడం చాలా టెన్షన్‌గా అనిపిస్తుందన్నారు చిరంజీవి. సోలోగా అయితే పర్వాలేదు, కానీ చరణ్‌తో ఎలాగా అని ఆలోచిస్తున్నట్టు తెలిపారు చిరు.
మరోవైపు కొరటాల శివ సైతం మీ ఇద్దరితో డాన్సుని చూడాలనుకుంటున్నామని, అలా ప్లాన్ చేయాలని రిక్వెస్ట్ లు వస్తున్నాయని, తట్టుకోలేకపోతున్నామని తెలిపారు. శేఖర్ మాస్టర్‌తో ప్లాన్ చేశామని తెలిపారు. ముందుగానే ఆయన్ని పంపిస్తానని చెప్పారు కొరటాల. చిరు, రామ్‌చరణ్ కూడా ఓకే అన్నారు. కొరటాల వెళ్లిపోయాక, అటు చిరు, ఇటు చరణ్ పోటీ పడటం ఆశ్చర్యానికి గురి చేసింది.

`ఏంటీ చరణ్ నన్ను డామినేట్ చేద్దామని చూస్తున్నావా? అనగా, నేనా..లేడు డాడీ అంటూ రామ్‌చరణ్ అమాయకంగా రియాక్ట్ అయ్యారు. దీనికి చిరు స్పందిస్తూ నేను నీ బాబుని రా అనగా, `డామినేట్ చేయను డాడీ, కానీ తగ్గను కూడా ` అంటూ ఝలక్ ఇచ్చాడు. ఆనీ అది సరిగా వినపడనట్టుగా `తగ్గాలి తగ్గుతావ్.. ` ఎస్ కరెక్ట్ గా చెప్పావాని చిరంజీవి అన్నారు. దీనికి చరణ్ రియాక్ట్ అవుతూ `తగ్గాలి కాదు డాడీ.. తగ్గను అంటున్నా, నీ ట్రైనింగ్ నుంచి వచ్చాను. తగ్గితే బాగుండదు కదా` అని తెలిపారు. ఇక్కడెందుకు కబుర్లు కెమెరా ముందు సెట్స్ లో చూసుకుందాం పదా` అంటూ చిరంజీవి తెలపడం హైలైట్‌గా నిలిచింది.
వీరిద్దరి మధ్య డిస్కషనే ఇంత హాట్‌గా ఉంటే, ఇక సెట్‌లో వీరి డాన్సులు ఏ రేంజ్‌లో ఉంటాయో ఆలోచించడానికే గూస్‌బంమ్స్ వస్తున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ బిగ్గెస్ట్ ట్రీట్‌గా ఈ పాట నిలవబోతుందని చెప్పొచ్చు. ఈ పాటకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
