మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది రంగస్థలంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొన్న సంగతి తెలిసిందే. అదే విధంగా నటనాపరంగా కూడా విమర్శకులకు చరణ్ గట్టి సమాధానం ఇచ్చాడు. ఇకపోతే హీరోగానే కాకుండా చరణ్ గత కొంత కాలంగా వ్యక్తిగతంగా నడుచుకుంటున్న తీరు అతని ఫాలోవర్స్ సంఖ్యని పెంచుతోంది. 

ఇతరులకు సహాయం చేయడం అలాగే అభిమానులను స్పెషల్ గా కలుసుకోవడం బాబాయ్ తో అతను ఉంటున్న తీరు చరణ్ స్టైల్ కి కొత్త అర్ధాన్ని చెబుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. చరణ్ నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదివరకు చరణ్ చాలా బిజిగా గడపనున్నాడు. 

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేస్తోన్న చరణ్ ఈ ప్రాజెక్ట్ ను డిసెంబర్ సెకండ్ వీక్ లో ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తారక్ మల్టీస్టారర్ RRR ను రీసెంట్ గా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీటికి తోడు తండ్రి మెగాస్టార్ రెండు ప్రాజెక్టులతో నిర్మాతగా బిజీగా ఉన్నాడు. 

సైరా సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చేయనున్న అప్ కమింగ్ ప్రాజెక్టును కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అఖిల్ తో కూడా ఒక సినిమాను నిర్మించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని చరణ్ మాత్రం ప్రస్తుతం నాలుగు సినిమాలతో రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాడు.