సంక్రాంతికి చరణ్.. ఇది ఫిక్స్!

First Published 16, Jun 2018, 2:57 PM IST
Ram Charan Boyapati Film for Sankranthi
Highlights

వచ్చే ఏడాది సంక్రాంతి పోరులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాతో రంగంలోకి దిగనున్నాడు. 

వచ్చే ఏడాది సంక్రాంతి పోరులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాతో రంగంలోకి దిగనున్నాడు. బోయపాటి దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దాదాపు ఈ సినిమా కోసం 80 కోట్లు ఖర్చు చేస్తున్నారని వినికిడి. ఒక్క యాక్షన్ ఎపిసో ల కోసమే భారీ మొత్తంలో ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇటు చరణ్ కు అటు బోయపాటికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.

వివేక్ ఎంట్రీ సీన్ కోసమే దర్శకుడు బోయపాటి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట. సాధారణంగా బోయపాటి సినిమాలలో విలన్లు చాలా బలంగా ఉంటారు. ఈ సినిమాలో కూడా వివేక్ పాత్రను అంతే బలంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. 
 

loader