మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండడం విశేషం. అల్లూరిగా రాంచరణ్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. 

ఇదిలా ఉండగా తన కుటుంబంలో జరిగిన బర్త్ డే సెలెబ్రేషన్స్ లో రాంచరణ్ మెరిశాడు. రాంచరణ్ సోదరి శ్రీజ పెద్ద కుమార్తె నివృతి జన్మదిన వేడుకలు ఇటీవల జరిగాయి. ఈ బర్త్ డే సెలబ్రేషన్ లో పాల్గొన్న రాంచరణ్ తన మేన కోడలిని ఆశీర్వదించాడు. బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ సెలెబ్రేషన్స్ లో శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు పాల్గొన్నారు. శ్రీజ పెద్ద కుమార్తె నివృతికి ఇది 11వ జన్మదినం. శ్రీజ, ఆమె మాజీ భర్త సంతానమే నివృత్తి. మాజీ భర్త నుంచి విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది.