సారాంశం
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వినిపించేలా ఉంది.. చరణ్ సినిమా నుంచి అప్ డేట్స్ కోసం కళ్లు కాయలు కసేలా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇక ముందు సర్ ప్రైజ్ ల వర్షం కురిపించబోతున్నాడు మెగా పవర్ స్టార్..?
రామ్ చరణ్ వెండితెరపై సందడిచేసి చాలా కాలం అవుతుంది. ఫ్యాన్స్ మంచి ఆకలిమీద ఉన్నారు. థిమేటర్ లో చరణ్ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదరు చూస్తున్నారు. అది లేట్ అయినాపర్వాలేదు. కాని.. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేలా చరణ్ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అంటే అది కూడా లేదు. దాంతో ఫ్యాన్స్ ఒక రకంగా అలిగారట. మరీ ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ పై గుర్రుగా ఉన్నారట రామ్ చరణ్ ఫ్యాన్స్.
రామ్ చరణ్ తో శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ బ్రేక్ లు వేస్తూ సాగుతోంది. తాజాగా మైసూర్ లో షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా.. ఓటువేయడానికి చరణ్ హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారు. అయితే శంకర్ అటు భారతీయుడు2 షూటింగ్ కోసం గేమ్ ఛేంజర్ ను కాస్త నిర్లక్ష్యంచేశారన్నా పేరు ఉంది. దాంతో చరణ్ ప్యాన్స్ శంకర్ మీద కాస్త గుర్రుగా ఉన్నారట.రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలం అయ్యింది. దాంతో ఫ్యాన్స్ కనీసం చరణ్ సినిమానుంచి అప్ డేట్ అయినా వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. కాని శంకర్ మాత్రం గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్ డేట్ ఏమీ ఇవ్వడం లేదు.
అటు షూటింగ్ విషయంలో మొన్నటి వరకూ ఎలా ఉన్నా.. ఈమధ్య మాత్రం రామ్ చరణ్ శంకర్ కు డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో నెక్ట్స్ సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీకోసం ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. దాంతో మార్చ్ వరకూ శంకర్ కు టైమ్ ఇచ్చారట మెగా పవర్ స్టార్. అంతే కాదు ఫ్యాన్స్ కోసం సాలిడ్ అప్ డేట్ కూడా రెడీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు గేమ్ చేంజర్ కూడా మేజర్ షూటింగ్ ఎప్పుడోఅయిపోయిందంటున్నారు. ఇక ఈనెలలోఆల్ మోస్ట్ కంప్లీట్ చేసి..ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉంటే.. నెక్ట్స్ మన్త్ ప్లాన్ చేస్తారని వినికిడి.
ఇక వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు బుచ్చిబాబు సినిమా షూటింగ్ లాగ్ చేయకుండా వరుస షెడ్యూల్స్ నుప్లాన్ చేసుకోమనిచెప్పినట్టు తెలుస్తోంది. వెంట వెంటనే సినిమాలు కంప్లీట్ అయ్యేలా మెగా పవర్ స్టార్ చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో గేమ్ ఛేంజర్ నుంచి సాలిడ్ అప్ డేట్ మాత్రం ..ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తుందట.