Asianet News TeluguAsianet News Telugu

RC16 : రామ్ చరణ్ ‘ఆర్సీ16’లో శివన్న... విజయ్ సేతుపతికి బదులుగా కన్నడస్టార్!

రామ్ చరణ్ - బుచ్చి బాబు కాంబోలోని ‘ఆర్సీ16’ RC16 పై రీసెంట్ గా బాగానే వార్తలు వినిపిస్తున్నాయి.  తాజాగా మరో బిగ్ అప్డేట్ అందింది. చరణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ వచ్చేసింది. 

Ram Charan and Buchibabu Movie RC16 Update NSK
Author
First Published Feb 11, 2024, 10:08 PM IST | Last Updated Feb 11, 2024, 10:08 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ RRRతో   అలరించారు.  ఇక నెక్ట్స్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’ Game Changerతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ చిత్రం 2024లోనే రానుంది. చిత్రానికి  నిర్మాత దిల్ రాజు  డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. త్వరలో ఆ విషయం తేలనుంది.  ఇదిలా ఉంటే... ‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu)తో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. షూటింగ్ మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి  చిత్రీకరణను వీలైనంత స్పీడ్ గా ముగిస్తున్నారు. రీసెంట్ గా ఆడిషన్ ను కూడా నిర్వహించి ఈ భారీ ప్రాజెక్ట్ లో న్యూ అండ్ యంగ్ టాలెంట్ ను కూడా ఆహ్వానించారు.

ఈ చిత్రం గురించి సంధుకో సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ఈ చిత్రంలో నటించబోతున్నారని బజ్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా మాత్రం బిగ్ అప్డేట్ అందింది. చిత్రంలో ఇప్పటికే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి Vijay Sethupathi కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ పాత్రలో ఇప్పుడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ SivaRaj Kumar నటిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే వెండితెరపై జరగబోయే మ్యాజిక్ ఆడియెన్స్ కు ఫీస్ట్ అనే చెప్పాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios