రామ్ చరణ్ సినిమా కోసం ఫస్ట్ టైమ్ స్టార్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పనిచేయబోతున్నారు. ఆయన తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ.. అందులో ప్లాప్ సినిమాలే ఎక్కువ..? మరి చరణ్ తో రెహమాన్ కాంబో వర్కౌట్ అవుతుందా..?  

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా గేమ్ చేంజర్. కియార అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో అంజలి కీలకపాత్రలో కనిపించబోతోంది. అంతే కాదు.. సునిల్, నవీన్ చంద్ర, జయరాం లాంటి సీనియర్ నటుడు కూడా ఈమూవీలో ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతే కాదు ఈసినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో రూపొందబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చరణ్ బ్యూయోల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక రామ్ చరణ్ తన భార్య, పిల్ల కోసం బ్రేక్ తీసుకోవడంతో.. సినిమా షూటింగ్ చాలా కాలంగా ఆగిపోయి ఉంది. ఇక ఈనెలలో ఈసినిమా షూటింగ్ పరుగులు పెట్టించబోతున్నాడట రామ్ చరణ్. కూతురు పుట్టిన ఆనందంలో.. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయ బోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో...చరణ్ సినిమా చేయబోతున్నాడు. 

ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత బుచ్చిబాబు తన నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు బుచ్చి బాబు. ఈ ఈ క్రమంలోనే ఆయన ఏ ఆర్ రెహమాన్ ను ఈ మూవీ కోసం రంగంలోకి దింపాలని చూస్తున్నారట.ఇందుకోసమే ఆయన పదే పదే చెన్నై కు వెళ్తున్నాడని తెలుస్తోంది. ఏ.ఆర్ రెహమాన్ ను ఎలాగైనా ఈ మూవీకి తీసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట బుచ్చిబాబు. అలాగే ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది.

మరి ఇది ఎంత వరకూ నిజమో కాని.. రామ్ చరణ్ త్వరగా గేమ్ చేంజర్ ను కంప్లీట్ చేసి.. బుచ్చిబాబు సినిమాలో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడట. ఇక ఈనెలలో షూటింగ్ స్టార్ట్ అయితే.. నాన్ స్టాప్ గా పాల్గొని..గేమ్ చేంజర్ ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశాడట చరణ్. మరి వారు అనుకున్నట్ట జరుగుతుందా.. అనుకున్న టైమ్ కు శంకర్ సినిమా పూర్తయ్యి రిలీజ్ అవుదందా అనేది చూడాలి.