Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ సలహాతో గ్రామాలకు అండగా మెగా హీరో!

తుఫాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం వాసుల జీవితాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విజయనగరం వాసులకు కూడా తఫాను ప్రభావం తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. అయితే వారిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు చాలా మంది ప్రముఖులు. అయితే మొదటిసారి ఒక హీరో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు. 

 

ram charan adopt effected villages
Author
Hyderabad, First Published Oct 21, 2018, 3:42 PM IST

తితిలీ తుఫాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం వాసుల జీవితాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విజయనగరం వాసులకు కూడా తఫాను ప్రభావం తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. అయితే వారిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు చాలా మంది ప్రముఖులు. అయితే మొదటిసారి ఒక హీరో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు. 

అతను ఎవరో కాదు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ సలహామేరకు తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం - విజయనగరం గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పటికే తన టీమ్ తో ఈ విషయం గురించి చర్చించానని బాబాయ్ ఇచ్చిన ఐడియా మంచిదని ఆయన సలహా మేరకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. 

త్వరలోనే నష్టపోయిన గ్రామాలను కనుగొని వాటికి ఏ విధంగా సహాయపడాలి అనే వివరాలు సేకరించి త్వరలోనే అనౌన్స్ మెంట్ చేస్తానని రామ్ చరణ్ ఒక నోట్ ద్వారా మీడియాకు తెలియజేశారు. చరణ్ గతంలో ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసి బాబాయ్ దారిలోనే అబ్బాయ్ కూడా నడుస్తున్నాడని అభిమానుల నుంచి మన్ననలను అందుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios