Asianet News TeluguAsianet News Telugu

రకుల్ తో మోక్షజ్ఞ రొమాన్స్

బాలకృష్ణ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. త్వరలో జరిగిపోనుంది. అది కూడా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రంతోనే కావడం విశేషం.

Rakul To Romance Nandamuri Mokshagna?

నందమూరి అభిమానులకు శుభవార్త. ఆ కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైపోయాడు. బాలకృష్ణ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. త్వరలో జరిగిపోనుంది. అది కూడా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రంతోనే కావడం విశేషం.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్‌టీఆర్‌’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక పూర్తై శర వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది ఈ చిత్రం. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌లో రకుల్‌ ప్రీత్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారంట.

వివరాల ప్రకారం.. ఈ చిత్రంలో రకుల్‌ ఎన్టీఆర్‌కు పాలు అమ్మే మహిళ పాత్రలో, బాలాయ్య తనయుడు మోక్షజ్ఞతో జత కట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్న సంగతి తెలిసిందే. యువ ఎన్టీఆర్‌కు జోడిగా రకుల్‌ జతకట్టనున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు చిత్రంలో కీలకం కానున్నయని టాక్‌. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో రకుల్‌ని అలనాటి అందాల తార శ్రీదేవి పాత్ర కోసం తీసుకోనున్నట్లు సమాచారం.

మరి ఇంతకు రకుల్‌ ఎవరి పాత్రలో కనిపిస్తుందనే సస్పెన్స్‌ వీడాలంటే.. రకుల్‌ లేదా చిత్ర యూనిట్‌ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ అభిమానులు ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లో పాల్గొనడం కోసం విద్యా రామోజీ ఫిలీం సిటిలో ఎంటర్‌ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios