టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలతో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గాయి. ఇలాంటి సమయంలో ఆమె రెమ్యునరేషన్ మరింత పెంచి షాక్ ఇస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్లను వెతకడం కష్టంగా మారింది.

కుర్రభామలు కొందరు సీనియర్ హీరోల పక్కన నటిస్తే తమ క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందా..? అని ఆలోచిస్తున్నారు. అయితే రకుల్ మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకోకుండా అక్కడ క్యాష్ చేసుకునే పనిలో పడింది. నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ 'మన్మధుడు 2' సినిమాను తెరకెక్కించబోతున్నాడు. 

ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ని తీసుకోవాలనుకున్నారు. రకుల్ కి కూడా కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఒప్పుకుంది. అయితే రెమ్యునరేషన్ గా కోటిన్నర ఇవ్వాలని డిమాండ్ చేసిందట. నిజానికి రకుల్ కి ఒక్కో సినిమాకి తొంబై లక్షల నుండి కోటి రూపాయల వరకు చార్జ్ చేస్తుంది.

కానీ ఈ సినిమాకి మాత్రం తన రెమ్యునరేషన్ పెంచేసింది. నిర్మాతలు కూడా అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి రకుల్ ఆఫర్లు లేని సమయంలో కూడా రెమ్యునరేషన్ పెంచి ఆశ్చర్యపరుస్తోంది.