'స్పైడర్' సినిమా ఫ్లాప్ తరువాత రకుల్ మరే తెలుగు సినిమా సైన్ చేయలేదు. తెలుగులో ఆమె హవా బాగా తగ్గిపోయింది. కొత్త హీరోయిన్ల తాకిడి పెరగడం, వారికి యూత్ లో ఫాలోయింగ్ పెరగడంతో రకుల్ కి అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో కోలివుడ్ లో ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు విడుదల చేసే రకుల్ ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. 'ఎన్టీఆర్' బయోపిక్ లో శ్రీదేవి పాత్ర మాత్రం పోషించింది. ఆ సినిమా కొత్త సంవత్సరంలో విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా ఎట్టకేలకు ఈ బ్యూటీ ఓ తెలుగు సినిమా సైన్ చేసిందని అంటున్నారు.

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ గా రకుల్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. రకుల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తిచూపిస్తుందని తెలుస్తోంది.

ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోలతో నటించే రకుల్ కి కుర్ర హీరోలతో నటించడానికి సమయం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అవకాశాలు లేక నితిన్ లాంటి హీరోలతో కూడా పని చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కాకుండా రకుల్ చేతిలో రెండు హిందీ సినిమాలు, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి.