Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో:నడుముకు 40 కిలోల బరువును కట్టుకొని వర్కవుట్స్

టాలీవుడ్ స్టార్  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ పై ఉన్న శ్రద్ధ గురించి అందరికీ తెలుసు. టైమ్  దొరికితే చాలు జిమ్ లోకు ఎంట్రీ ఇచ్చేస్తూంటుంది. 

rakul preet singh gym video goes viral
Author
Hyderabad, First Published Oct 31, 2018, 10:13 AM IST

టాలీవుడ్ స్టార్  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ పై ఉన్న శ్రద్ధ గురించి అందరికీ తెలుసు. టైమ్  దొరికితే చాలు జిమ్ లోకు ఎంట్రీ ఇచ్చేస్తూంటుంది. రోజులో  ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతూంటుంది. అంతేకాదు తనలా ఫిట్ గా ఉండాలనుకునే వారి కోసం F45 ట్రైనింగ్ జిమ్ సెంటర్లను కూడా ప్రారంభించింది.

అయితే ఆ జిమ్ ల ప్రమోషన్ కోసమో లేక తను ఫిట్ గా ఉన్నానని చెప్పటం కోసమో కానీ..అప్పుడప్పుడూ తను జిమ్ చేస్తున్న వీడియోలు షేర్ చేస్తూంటుంది. ఆ వీడియోలని ఆమె అభిమానులు షేర్ చేసి వైరల్ చేస్తూంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వదలింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తాజాగా రకుల్‌ జిమ్ లో కసరత్తులు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన  వీడియో ఇది. 

జిమ్‌లో నడుముకు 40 కిలోల బరువును కట్టుకొని స్వ్కాట్ చేస్తూ చేసిన వీడియో ఇది. మెడ నొప్పిగా ఉండటంతో 40 కిలోల బరువుతో స్వ్కాట్ చేశా అంటూ రాసి పోస్ట్ చేసింది. రకుల్‌ ప్రస్తుతం పలు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళ హీరో సూర్య సరసన 'ఎన్జీకే' సినిమాలో హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. కార్తీతో మరో సినిమాలో నటిస్తున్నారు. శివ కార్తికేయన్‌ 14వ చిత్రంలోనూ కనపడనుంది. 'ఎన్టీఆర్' సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్‌ కనిపిస్తోందనే సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios