రకుల్ హాట్ అనిపించుకుంటుందా?

rakul preet singh asking votes for her hotness
Highlights

ఓటింగ్ అనే పదం రాజకీయాల్లో మాత్రమే ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు ఆన్ లైన్

ఓటింగ్ అనే పదం రాజకీయాల్లో మాత్రమే ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు ఆన్ లైన్ పోల్స్ మొదలైన తరువాత సోషల్ ఫ్లాట్ ఫామ్ మీదకు కూడా ఓటింగ్ సిస్టమ్ వచ్చేసింది. ఇక అసలు విషయానికొస్తే.. తన హాట్ నెస్ కు ఓటు వేయమని అడుగుతోంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.ఓ మ్యాగజైన్ సంస్థ నిర్వహిస్తోన్న హాట్ భామల పోల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది రకుల్.

ఈ పోల్ లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులు కంటెండర్స్ గా ఉన్నారు. మొత్తం 100 మంది సుందరాంగులను సెలెక్ట్ చేసుకొని వారి ఫోటోలతో ఓ పోర్టల్ మొదలుపెట్టారు. టాలీవుడ్ నుండి రకుల్ ప్రీత్ ను సెలెక్ట్ చేసుకున్నారు. వీరందరిలో నెటిజన్లు ఎవరిని ఎన్నుకుంటారో వారు హాట్ అని అనిపించుకుంటారు. అలా ఇందులో భాగమైన రకుల్ తనకు ఓటు వేయమని అడుగుతోంది. ఆ పోల్ లింక్ ను షేర్ చేస్తూ అందులో పాల్గోమని చెబుతోంది. మరి హాలీవుడ్, బాలీవుడ్ భామలను మించి రకుల్ ఈ పోటీలో నిలుస్తుందేమో చూడాలి!

loader