రకుల్ టూ కాస్ట్లీ.. 15 నిమిషాలకు పాతిక లక్షలు!

rakul preet sing remuneration for dance performance at film fare event
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలు లేక కాస్త 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలు లేక కాస్త డల్ అయిపోయింది. తమిళంలో రెండు సినిమాలు చేతిలో ఉన్నా.. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు.

ఈ మధ్య మ్యాగజైన్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ. తాజాగా రకుల్ కు మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పదిహేను నిమిషాల పాటు స్టేజ్ మీద డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తే ఏకంగా పాతిక లక్షలు ఇస్తామని ఫిలిం ఫేర్ అధికారులు చెప్పడంతో ఇప్పుడు డాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఫిలిం ఫేర్  అవార్డ్స్ జరుగుతున్నాయి.

హైదరాబాద్ లో అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకలో స్టార్ హీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మన్స్ లు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా రకుల్ ని ఈ షోలో పాల్గొనమని అడిగారు. స్టేజ్ మీద 15 నిమిషాల డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ. దీనికోసం పాతిక లక్షల రెమ్యునరేషన్ అందుకుందట. పాతిక లక్షలంటే తక్కువ మొత్తమేమీ కాదు ఒక హీరోయిన్ రెమ్యునరేషన్ కు సమానం. 

loader