Asianet News TeluguAsianet News Telugu

`ఆపరేషన్‌ రావణ్‌` వచ్చేది అప్పుడే.. `పలాస` హీరోకి హిట్‌ పడేనా?

`పలాస 1978` చిత్రంతో హిట్‌ కొట్టాడు యంగ్‌ హీరో రక్షిత్‌ అట్లూరి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా సరైన హిట్‌ పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బలమైన కంటెంట్‌తో వస్తున్నాడు. 
 

Rakshith Atluri operation ravan movie release date final arj
Author
First Published Jul 3, 2024, 7:41 PM IST

`పలాస 1978` చిత్రంతో ఆకట్టుకున్నాడు యంగ్‌ హీరో రక్షిత్‌ అట్లూరి. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. `పలాస` మూవీ తెచ్చిన పేరు సక్సెస్‌ మళ్లీ పడలేదు. ఆ తర్వాత సినిమాలు వస్తున్నాయిగానీ, బ్రేక్‌ ఇచ్చే సక్సెస్‌ రావడం లేదు. ఈ క్రమంలో స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నాడు రక్షిత్‌ అట్లూరి. ఈ క్రమంలో ఆయన్నుంచి ఇప్పుడు మరో సినిమా వస్తుంది. `ఆపరేషన్‌ రావణ్‌` పవర్‌ఫుల్‌ టైటిల్‌తో సినిమా రూపొందింది. 

ఇందులో రక్షిత్‌కి జోడీగా సంగీర్తన విపిన్‌ నటిస్తుంది. రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తుంది. దీనికి వెంకట సత్య ఈ మూవీని తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. న్యూ ఏజ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట్‌ సత్య దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. ఆగస్ట్ 2న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన కొత్త పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. 

అయితే ఇందులో `ఆపరేషన్‌ రావణ్‌`టైటిల్‌తోపాటు ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్‌ ఉండటం ఆశ్చర్యంగా మారింది. రియల్‌ సైకో స్టోరీని తెరకెక్కిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక యాక్షన్‌ సీక్వెన్స్ లో హీరో రక్షిత్‌ అట్లూరి స్టిల్స్ డిజైన్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. `ఆపరేషన్ రావణ్` సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీవీ5 మూర్తి కూడా నటిస్తుండటం విశేషం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios