Asianet News TeluguAsianet News Telugu

Narakasura Trailer : ‘దేవుళ్లు కూడా రాక్షసులుగా మారాల్సివస్తుంది’.. ‘నరకాసుర’ ట్రైలర్

హీరో రక్షిత్ అట్లూరి నటించిన యాక్షన్ డ్రామా ‘నరకాసుర’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది.

Rakshit Atluris Narakasura MovieTrailer Out now NSK
Author
First Published Oct 24, 2023, 3:48 PM IST | Last Updated Oct 24, 2023, 3:48 PM IST

‘పలాస’ చిత్రంతో హీరో రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అంతకు ముందుకు ‘లండన్ బాబులు’ చిత్రంలో నటించినా పెద్దగా ఆకట్టుకలేకపోయారు. ‘పలాస’ ఇచ్చిన మంచి రిజల్ట్ తో తదుపరిచిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇక ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో రాబోతున్నారు. రక్షిత్ అట్లూరి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘నరకాసుర’. ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

Narakasura చిత్రంలోరక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌, శత్రు ప్రధాన పాత్రలు పోషించారు. సెబాస్టియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతున్నారు. 

రక్షిత్ అట్లూరి పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు అనుకోని ఆపద వస్తుంది. దీంతో కీడు చేయాలనుకునే వారితో పోరాడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటీ? ఎందుకు ఆ గ్రామస్తులపై దాడి జరుగుతుందనేది సినిమాగా అర్థమవుతోంది. ట్రైలర్ లో ఎమోషన్, లవ్, యాక్షన్ అంశాలను చక్కగా చూపించారు. రక్షిత్ అట్లూరి యాక్షన్ పరంగా అదరగొట్టారు. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ‘కొన్నికొన్ని సార్లు దేవుళ్లు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది’ అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. నంబర్ 3న చిత్రం విడుదల కానుంది. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios