కన్నడ ఫిల్మ్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Kgf Chapter 2) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఊహించని విధంగా దూసుకెళ్తోంది. తొలివారం పూర్తైయిన ఇంకా వసూళ్లను రాబడుతూనే ఉన్నాడు రాఖీ భాయ్. తాజా రిపోర్ట్ ప్రకారం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.  

KGF ఛాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారం పూర్తయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును అధిగమించి, రికార్డులను బద్దలు కొట్టిందీ కేజీఎఫ్. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఐదో రోజు గ్లోబల్ బాక్సాఫీస్‌ను కూడా దెబ్బతీసేలా కనిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ (Yash), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్లాక్ బాస్టర్ చిత్రం రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. తొలిరోజే రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా విడుదలైన ఐదురోజుల్లో చేసిన వసూళ్లు చేస్తూ మతిపోవాల్సిందే. ఒక కన్నడ చిత్రం ఇంతలా వసూళ్లను రాబట్టడం సరికొత్త రికార్డుగా నిలిచిపోతోంది. 

తాజా రిపోర్టు ప్రకారం ఐదోరోజు కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. టీఎస్, ఏపీలో ఐదో రోజు కలెక్షన్ల వివరాలు ఇలా.. నైజాంలో రూ.2.46 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.28 లక్షలు, సీడెడ్ లో రూ.74 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.52 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.19 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.23 లక్షలు, క్రిష్ణలో రూ.26 లక్షలు వసూల్ చేసింది. మొత్తంగా ఐదో రోజున రూ. 8.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధంచింది. మరోవైపు హిందీలోనూ ఐదవ రోజు రూ. 25.57 కోట్లు వసూళ్లు చేసింది. ఐదో రోజు మొత్తంగా రూ. 73.29 కోట్లు వసూళ్లను రాబ్టటింది.

కేజీఎఫ్ ఛాప్టర్ 2 మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఐదురోజుల్లో రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ రికార్డుతో ఇండియా హయ్యేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా గుర్తింపు పొందింది. దీంతో టాప్ టెన్ చిత్రాల్లో 9వ స్థానాన్ని దక్కించుకుంది. Kgf Chapter 2 తొలిరోజు రూ. 165.37 కోట్లు, రెండో రోజు రూ.139.25 కోట్లు, మూడో రోజు రూ.115.08 కోట్లు, నాలుగో రోజు రూ. 132.13 కోట్లు, ఐదో రోజు రూ. 73.29 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం 5 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తుంది. మొత్తం రూ. 625.12 కోట్లు సాధించినట్టు రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇండియన్ సినిమాల్లో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన 9వ సినిమాగా నిలిచింది కేజీఎఫ్ ఛాప్టర్ 2. 

Scroll to load tweet…