యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని పది రోజులు అవుతున్నా బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఇంకా ఆ షాక్‌ నుంచి కోలుకోలేదు. సుశాంత్ మృతికి ఇండస్ట్రీ రాజకీయాలే కారణం అంటూ పలువురు విమర్శలు చేస్తుండటంతో పోలీసు విచారణ కూడా అదే దిశగా జరుగుతోంది. ఇప్పటికే సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ సహా అతడి సన్నిహితలను విచారించిన పోలీసులు పలు నిర్మాణ సంస్థలను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో కాంట్రవర్షియల్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ మరో సంచలన ప్రకటన చేసింది. సాధారణంగా ఏ స్విచ్యువేషన్‌ను అయినా పబ్లిసిటీ కోసం వినియోగించుకోవటం రాఖీ సావంత్‌కు అలవాటు. ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసిన రాఖీ సంచలన కామెంట్స్‌ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తన కలలో వచ్చాడన్న రాఖీ సావంత్, తాను తన కడుపున పుడతానన్నాడని చెప్పింది.

అంతేకాదు సుశాంత్‌ తో సినిమా చేయాలనుకున్న నిర్మాతలకు ఓ అపీల్ చేశాడని కూడా చెప్పింది. సుశాంత్ సినిమాలు  చేయాలనుకున్న నిర్మాతలు ఆ సినిమాల్లో రాఖీ సావంత్‌కు ఓ ఐటమ్‌ సాంగ్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పాడని చెప్పింది. అయితే రాఖీ కామెంట్స్‌ను ఎవరు సీరియస్‌గా తీసుకోకపోయినా ఇలా ప్రతీ సందర్భాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవటంపై సుశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Jun 21, 2020 at 1:17am PDT