సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా దర్శకుడు రాజమౌళి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. అమెరికాలో జరుగుతున్న తానా సభల కోసం తాను రాలేదని, నేను వస్తానని ఎవరు కూడా ఆశలు పెట్టుకోవద్దని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ వైరల్ గా మారింది. 

జులై 4నుంచి అమెరికాలో తెలుగువారి తానా సభలు జరగనున్నాయి. ఈ ఈవెంట్స్ కి తెలుగు ప్రముఖులు చాలా మంది హాజరుకానున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి స్పెషల్ మ్యూజిక్ షో కూడా వేడుకలో భాగం కానుంది. అయితే వాషింగ్ టన్  వచ్చిన రాజమౌళి.. తనని తానా సభల్లో భాగంగా వచ్చారు అనుకుంటారేమో అని ట్విట్టర్ లో ముందే క్లారిటీ ఇచ్చారు. 

*పర్సనల్ వర్క్ లో భాగంగా వాషింగ్ టన్ వచ్చాను. తానా కన్వేషన్స్ కోసం రాలేదు. పెద్దన్న మ్యూజికల్ షోకి కూడా హాజరుకాకపోవచ్చు. సదస్సులో ప్రజలు నన్ను ఆశించి నిరాశ చెందాలని నేను కోరుకోను. అందువల్ల ఈ స్పష్టత* ఇస్తున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు.