మెగా ఫ్యామిలీని టచ్ చేసే దమ్ముందా..?

rajsekhar to play chiranjeevi role in uday kiran biopic
Highlights

'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు తీయడానికి 

'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌందర్య, ఉదయ్ కిరణ్ వంటి నటుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయాలనే ఆలోచన దర్శకుడు తేజకు వచ్చింది. ఉదయ్ కిరణ్ జీవితాన్ని తెరపై సినిమాగా చూపించాలని ఉందని తేజ వెల్లడించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ పాత్రలో హీరో రాజశేఖర్ ను చూపించే ఆలోచనతో ఉన్నాడట తేజ. ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో చిరంజీవి పెద్ద కూతురుని అతడికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. నిశ్చితార్ధం కూడా జరిపారు. కానీ అనుకోని విధంగా ఈ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగిందనే విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు తేజ ఆ సంగతులన్నీ బయోపిక్ లో చూపిస్తాడా..? అని తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోతుంది.

మెగాఫ్యామిలీను ఇన్వాల్వ్ చేస్తూ ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో చూపించే దమ్ము తేజకు ఉందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అసలు సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇవ్వని తేజ టైటిల్ గా మాత్రం 'కాబోయే అల్లుడు' అనే పేరుని పెడతాడని అంటున్నారు.టైటిల్ ను బట్టే తేజ ఇంటెన్షన్ ఏంటో క్లియర్ గా అర్ధమవుతోంది. మరి దీనిపై మెగాఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి! 

loader