టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న  మల్టీస్టారర్ RRRపై రోజుకో రూమర్ చక్కర్లు కొడుతోంది.. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ పాత్రలపై ఎన్ని పుకార్లు షికార్లు చేస్తున్నా చిత్రయూనిట్ పెద్దగా పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా స్టార్ హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ కోసం జక్కన్న 45కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్ వచ్చింది. 

ఇక ఇప్పుడు అజయ్ దేవగన్ పాత్రకు సంబందించిన మరొక రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజయ్ దేవగన్ అల్లూరి సీతారామరాజు తండ్రిగా కనిపించనున్నట్లు చాలా రోజులుగా టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పాత్ర కోసం కూడా జక్కన్న భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ క్లి సంబందించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం 12కోట్ల మేర బడ్జెట్ నిర్ణయించినట్లు సమాచారం. 

నెక్స్ట్ షెడ్యూల్ లో ఆ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. అజయ్ దేవగన్ కనిపించేది కొద్దీ సేపే అయినప్పటికీ సినిమాలో ఆ పాత్రకు సంబందించిన ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని టాక్. దర్శకుడు రాజమౌళి హీరోల స్టార్ డమ్ ని దృష్టిలో ఉంచుకొని యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. 2020 జులై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.