ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసిన అంబరీష్ మరణం ఒక్కసారిగా ప్రముఖులను షాక్ కి గురి చేసింది. రెబల్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు చిత్ర పరిశ్రమలు నివాళులర్పిస్తున్నాయి. ఇక అంబరీష్ కి సన్నిహిత స్నేహితుడైన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరణ వార్త విని భావోద్వేగానికి లోనయ్యారు. 

స్నేహితుడి మరణవార్త వినగానే రజినీకాంత్ కంటతడి పెట్టారు. ఇక సోషల్ మీడియా ద్వారా అంబరీష్ ఆత్మకు శాంతి చేకూరాలని వివరించారు. మంచి మనసున్న వ్యక్తి.. నా బెస్ట్ ఫ్రెండ్.ని ఈ రోజు కోల్పోయాను. ఎంతో బాధాకరమైన విషయం. నిన్ను ఎప్పటికి మరచిపోలేము అంటూ అంబరీష్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు రజినీకాంత్ పేర్కొన్నారు.

 

66 సంవత్సరాల వయసు గల అంబరీష్ 1972లో ‘నాగరాహవు’ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తక్కువ సమయంలోనే కన్నడ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రేత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బెంగుళూరులో ఆయన పార్థివదేహాన్నీ చివరగా చూసేందుకు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో వెళుతున్నారు.