దేశవ్యాప్తంగా కెజిఎఫ్ చాప్టర్ 2 ప్రభంజనం నడుస్తుండగా... సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం సినిమా చూశారట. అనంతరం ఆయన మూవీపై తన అభిప్రాయం తెలియజేశారట.
సౌత్ ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయినా రజినీకాంత్ తర్వాత. దేశంలోనే మొదటి పాన్ ఇండియా స్టార్ గా ఆయనున్నారు. ఆ మాటకొస్తే విదేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ఘనత ఆయనది. దశాబ్దాల పాటు చిత్ర సీమను ఏలిన రజినీకాంత్ వేగం ఇంకా తగ్గలేదు. అయితే యంగ్ జనరేషన్ హీరోలు ఆయన రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్ తో రజినీకాంత్ రికార్డ్స్ బ్రేక్ చేశారు.
కాగా ప్రభాస్, రజినీకాంత్ తర్వాత సౌత్ నుండి ఆ స్థాయిలో ప్రభావం చూపిన హీరో యష్. కెజిఎఫ్ మూవీతో యష్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దేశంలోనే ఓ గొప్ప యాక్షన్ ఎంటర్టైనర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. 2018లో విడుదలైన కెజిఎఫ్ అన్ని భాషల్లో ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కెజిఎఫ్ పార్ట్ 2పై విపరీతమైన హైప్ నెలకొంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ తెరకెక్కింది.
ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తెలుగులో స్టార్ హీరోల రికార్డులు కూడా బ్రేక్ చేసిన కెజిఎఫ్ 2 ఆల్ టైం రికార్డు సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా కెజిఎఫ్ 2 చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ చూశారట. కెజిఎఫ్ 2 రజినీకాంత్ కి ఎంతగానో నచ్చేసిందట. వెంటనే చిత్ర యూనిట్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కెజిఎఫ్ 2 నిర్మాతలతో ప్రత్యేకంగా మాట్లాడారట. రజినీకాంత్ లాంటి ఆల్ టైం స్టార్ పొగడ్తల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ 2 రికార్డు వసూళ్ల వైపుగా దూసుకెళుతుంది. రెండు రోజుల్లోనే ప్రీరిలీజ్ బిజినెస్ లో యాభై శాతం వరకు రికవరీ చేసింది. పాజిటివ్ టాక్ నేపథ్యంలో వీకెండ్ ముగిసే నాటికి కెజిఎఫ్ 2 బ్రేక్ ఈవెన్ కి దగ్గర కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ 2 రూ. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలంగాణలో రూ. 26 కోట్లకు హక్కులు కొన్నారు. రెండు రోజులకే దాదాపు రూ. 17 కోట్ల షేర్ రాబట్టింది.
ఇక కెజిఎఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సలార్ బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. బాహుబలి 2 తర్వాత వరుసగా ప్రభాస్ రెండు ప్లాప్స్ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సలార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందని వారు నమ్ముతున్నారు. సలార్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. కాగా సలార్ టీజర్ త్వరలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.
