Asianet News TeluguAsianet News Telugu

ఆపండి... రజనీ కుర్చీలో కూర్చోవటం లేదు!

నిన్నటి నుంచి చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో రజనీకాంత్ కుర్చీలో కూర్చోబోతున్నాడట అంటూ కథనాలు అక్కడమ మీడియాలో మొదలయ్యాయి. సీఎం కుర్చీనా అని కొందరు వెంటనే దానికి కొందరు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేసేసారు. 

Rajinikanth's next titled Kurchi?
Author
Hyderabad, First Published Feb 6, 2019, 9:51 AM IST

నిన్నటి నుంచి చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో రజనీకాంత్ కుర్చీలో కూర్చోబోతున్నాడట అంటూ కథనాలు అక్కడమ మీడియాలో మొదలయ్యాయి. సీఎం కుర్చీనా అని కొందరు వెంటనే దానికి కొందరు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేసేసారు.  మురుగదాస్‌తో రజనీకాంత్‌ చేయబోయే సినిమాకు ‘నార్కాలి’(కుర్చీ) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారని అసలు వార్త‌. పొలిటికల్ సినిమా తీయాలనుకునే వాళ్లకు  మాత్రం మంచి డెప్త్ ఉన్న టైటిల్‌ ఇది.   

అందుకే ఓ రేంజిలో  డిస్కషన్స్‌కు దారి తీశాయి. అయితే అంత సీన్ లేదని మురగదాస్ తేల్చేసాడు. వివరాల్లోకి వెళితే..పేటా సినిమా రిలీజ్‌ తర్వాత రజనీకాంత్‌ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. సంచలన కథనం, కథనాలతో మెస్మరైజ్‌ చేసే దర్శకుడు మురుగదాస్‌ డైరెక్షన్‌లో ఆయన ఓ సినిమాకి సైన్‌ చేశాడు. ఆ సినిమాపై రోజుకో వార్త చొప్పున వస్తోంది. తాజాగా నార్కోలి అనే టైటిల్ పెట్టారనే వార్త గుప్పుమంది. 

అంటే తెలుగులో అర్ధం కుర్చీ.. టైటిల్‌కి తగ్గట్లే సినిమా పూర్తిగా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందనుందని ఆ వార్త సారాంశం.. అవినీతి, సామాజిక చైతన్యం, కార్పొరేట్‌ వ్యవస్థ వంటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసిన మురగదాస్ ఖచ్చితంగా ఇలాంటి సినిమానే రజనీతో చేస్తారని చాలా మంది నమ్మేసారు. ముఖ్యంగా త్వరలోనే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న రజనీకాంత్‌  పొలిటికల్‌ కెరీర్‌ లాంచింగ్‌కి ఇది బాగా ఎలివేషన్‌ అవుతుందనేది  ఆలోచన.. అయితే ఈ డిస్కషన్స్  మీద మురుగదాస్‌ నీళ్లు చల్లారు.

‘‘మా సినిమాకు ‘నార్కాలి’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. అనవసరంగా పుకార్లు పుట్టించకండి’’ అని క్లారిఫై చేశారు. రజనీను ఫ్యాన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో మా సినిమా అలా ఉంటుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాదు అని ఓ సందర్భంలో చెప్పారాయన. సన్‌ నెట్‌వర్క్‌ ఈ సినిమాను నిర్మించనుందట. మరో ప్రక్క ఈ సినిమాలో  హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే  మురుగదాస్‌ ‘సర్కార్‌’లో కీర్తీ సురేశ్‌ నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios