సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల పరంగా బిజీ అయిపోతాడని ఇక సినిమాలకు దూరమవుతారని అనుకుంటున్న తరుణంలో ఆయన మాత్రం వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు.

రీసెంట్ గా '2.0' సినిమా విడుదలైన ఘన విజయం అందుకుంది. త్వరలోనే 'పేటా' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఆయన 'పేటా' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విడుదలై హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్ డాన్ పాత్రలో కనిపిస్తాడనే వార్తలు వినిపించాయి. కానీ ఇందులో రజినీకాంత్ లేడీస్ హాస్టల్ లో ఉండే వార్డెన్ పాత్రలో కనిపిస్తారట.

సైన్యంలో పనిచేసిన కథానాయకుడు అక్కడ పదవీ విరమణ పొంది ఓ లేడీస్ హాస్టల్ లో వార్డెన్ గా జాయిన్ అవుతాడు. అక్కడ నుండి సినిమా కథ అనేక మలుపులు  తీసుకుంటుందని కోలివుడ్ వర్గాల సమాచారం. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని అనిరుద్ సంగీతం సమకూర్చారు.