మహాన్ మూవీ తలైవా రజినీకాంత్(Rajinikanth) కి భయంకరంగా నచ్చేసిందట. మహాన్ సినిమా అద్భుతం అంటూ రజినీ మూవీపై ప్రశంసలు కురిపించారట.

చియాన్ విక్రమ్ (Vikram)లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మహాన్. విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ మరో హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మద్యం సిండికేట్ లీడర్ విక్రమ్ నటించారు. తండ్రి అంటే అసహ్యం, ద్వేషంతో పెరిగిన పోలీస్ అధికారిగా ధృవ్ విక్రమ్ చేశారు. మహాన్ సెకండ్ హాఫ్ మొత్తం తండ్రి కొడుకుల మధ్య నడిచే ఆధిపత్య పోరు. 

సిమ్రన్ విక్రమ్ భార్య పాత్ర చేయగా.. బాబీ సింహ స్నేహితుడిగా మద్యం సిండికేట్ పార్ట్నర్ రోల్ చేశాడు. మహాన్ (Mahaan)మూవీ కోసం కార్తీక్ సుబ్బరాజ్ రాసుకున్న పాత్రలు చాలా బలంగా ఉన్నాయి. మహాన్ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్, ధృవ్ నటన అద్భుతం అంటూ పొగిడేస్తున్న ప్రేక్షకులు సినిమా మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదన్న మాట వినిపిస్తోంది. 

విక్రమ్ సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ ఆయనకు మరలా దక్కలేదు. విక్రమ్ పలు ప్రయోగాలు చేస్తున్నా.. ఫలితం రావడం లేదు. టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) తో ఆయన చేసిన మరో ప్రయోగమే మహాన్ చిత్రం. ఇక నేరుగా ఓటిటిలో విడుదలైన విక్రమ్ మొదటి చిత్రం కూడా మహాన్ కావడం విశేషం. గాంధీ మహాత్మ పాత్రలో విక్రమ్ ఎప్పటిలాగే జీవించారు. 

కాగా మహాన్ మూవీ తలైవా రజినీకాంత్(Rajinikanth) కి భయంకరంగా నచ్చేసిందట. మహాన్ సినిమా అద్భుతం అంటూ రజినీ మూవీపై ప్రశంసలు కురిపించారట. విక్రమ్, ధృవ్ నటనతో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభను రజినీకాంత్ ప్రత్యేకంగా కొనియాడారట. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పొందుపరిచారు. 

కార్తీక్ సుబ్బరాజ్ రజినీకాంత్ తో పేట చిత్రం చేశారు. తెలుగులో అంతగా ఆదరణ దక్కించుకోని పేట చిత్రం... తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. పేట భారీగానే వసూళ్లను రాబట్టింది. ఆ పరిచయంతోనే కార్తీక్ సుబ్బరాజ్ మహాన్ మూవీపై రజినీకాంత్ పాజిటివ్ గా స్పందించారు. పరోక్షంగా మహాన్ మూవీకి రజినీకాంత్ ప్రచారం కల్పించారు. 

మరో వైపు రజనీకాంత్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ అన్నాత్తే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళనాడులో వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన 169వ చిత్రం ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ తో బీస్ట్ మూవీ చేస్తున్న నెల్సన్... త్వరలోనే రజినీ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.