కూతుళ్లని నిలబెట్టేందుకు రజనీకాంత్‌ ప్రయత్నం.. ఇప్పుడు సౌందర్య కోసం మరో సాహసం..

`లాల్‌ సలామ్‌`తో పెద్ద కూతురు వంతు అయిపోయింది. ఇప్పుడు చిన్న కూతురు కోసం సాహసం చేయబోతున్నారు రజనీకాంత్‌. మరో సారి ఆమెకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
 

rajinikanth once again dare for young daughter soundarya ? arj

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన కూతుళ్లని సినిమా రంగంలో నిలబెట్టేందుకు తనవంతు సహాయం చేస్తున్నాడు. వారి సినిమాల్లో నటిస్తూ అండగా నిలుస్తున్నాడు. గతంలో చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్‌ కోసం `కొచ్చడయాన్‌` అనే సినిమాలో నటించాడు. మోషన్‌ పిక్చర్‌ కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించింది. కానీ ఇది నిరాశ పరిచింది. రజనీకాంత్‌ని యానిమేషన్‌లో చూడలేకపోయారు ఆడియెన్స్. దీంతో డిజాస్టర్‌ అయ్యింది. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుంది సౌందర్య. ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతుంది. ఆమె దర్శకురాలిగా మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధమవుతుంది. 

ప్రస్తుతం సౌందర్య రజనీకాంత్‌ ఓ సినిమా చేస్తుంది. రాఘవ లారెన్స్ హీరోగా సినిమా చేస్తుంది. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్‌ థాను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇందులో రజనీకాంత్‌ నటించబోతున్నారట. గెస్ట్ రోల్‌ చేసేందుకు ఒప్పుకున్నారట. అంతేకాదు కాల్షీట్లు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. దాదాపు పది రోజుల డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఇటీవలే పెద్ద కూతురు ఐశ్వర్యా రజనీకాంత్‌ కోసం తనవంతు సహాయాన్ని అందించాడు రజనీ. `లాల్‌ సలామ్‌` చిత్రంలో మెయిన్‌ రోల్‌ చేశారు. మొదట గెస్ట్ రోల్ అన్నారు. తీరా సినిమా చూస్తే ఆయన పాత్ర ఫుల్‌ లెన్త్ ఉంది. కానీ సినిమా డిజప్పాయింట్‌ చేసింది. ఇద్దరి కూతుళ్ల సినిమాలు ఆడలేదు. ఇప్పుడు మరోసారి చిన్న కూతురు కోసం సాహసం చేస్తున్నారు రజనీ. కూతుళ్లని నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్లు నిరూపించుకోలేకపోతున్నారు. మరి ఈసారైనా చిన్న కూతురు హిట్ కొడుతుందా అనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios