సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ముందుగా గుర్తొచ్చేది అతడి స్టైల్, మేనరిజమ్స్. అతడు సిగరెట్ కాల్చడంలో ఓ స్పెషల్ స్టైల్ ఉంటుంది. దానికి కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. సిగరెట్ స్టైల్ లో ఆయనను అనుకరించాలని ప్రయత్నిస్తుంటారు.

అయితే సూపర్ స్టార్ కి ఈ స్టైల్ ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ''బాలీవుడ్ లో శత్రుఘ్న సిన్హా ఇలాంటి స్టైల్ ను ఓ సినిమాలో ప్రదర్శించారు. అప్పటినుండి దాన్ని ఇంకాస్త బెటర్ గా చేయడం కోసం ప్రయత్నించాను.

సిగరెట్ పెదాల మధ్యలోకి సరిగా రావడానికి అద్దం ముందు నిలబడి కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడ్ని. అది స్టైలే కానీ దానికి టైమింగ్ కూడా చాలా ముఖ్యం. అది కేవలం విసరడం, పట్టుకోవడం కాదు. మొదట సీన్, సైలాగ్స్ అర్ధం చేసుకొని ఏ టైమ్ లో సిగరెట్ ని నోటితో పట్టుకోవాలో అర్ధం చేసుకోవడం చాలా అవసరం'' అంటూ వెల్లడించారు.

ఇక తన నడక, వేగం పుట్టుకతో వచ్చినవని అవన్నీ సహజంగానే చేస్తుంటానని అన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో శివాజీ గనేషన్ ని ఇమిటేట్ చేసేవాడినని అప్పుడు బాలచందర్ గారు అలా చేయొద్దని వారించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నీలో వేగాన్ని ఎప్పటికీ అలానే ఉంచని బాలచందర్ గారు చెప్పినట్లు రజినీకాంత్ స్పష్టం చేశారు.