36 దేశాల్లో రజినీకాంత్ రికార్డ్, జైలర్ సినిమాకు ఓటీటీ లో భారీ స్పందన
ఓటీటీల్లోకి వచ్చిన తరువాత కూడా రికార్డ్ ల పరంపర ఆపలేదు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా. ఇప్పటికీ అదే జోరు కొనసాగుతోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా జైలర్. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తోనిర్మించిన ఈసినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా లాస్ట్ ఇయర్.. అంటే ఆగస్టు 10 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి..సంచలనంగా మారింది. రజినీకాంత్ పని అయిపోయింది.. ఆయన మార్కెట్ పడిపోయింది అని విమర్షించిన నోర్లు మూతపడేలా సమాధానం చెపుతూ.. జైలర్ సంచలన రికార్డ్ లు సృష్టించింది.
రిలీజ్ అయిన తొలి రోజునుంచే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది.రమ్యకృష్ణ .. తమన్నా .. సునీల్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ.. 700 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కి ఒక రేంజ్ లో మార్కులు పడ్డాయి. యోగిబాబు కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అలాంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను రిలీజ్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభించిందని అంటున్నారు. 36 దేశాలలో ఈ సినిమా ట్రెండింగులో నిలిచిందని చెబుతున్నారు. థియేటర్స్ లో మాత్రమే కాకుండా, ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం విశేషంగానే చెప్పుకోవాలి. అయితే ఓటీటీలోకి వచ్చినా కూడా ఇప్పటికీ ఈసినిమా కొన్ని ఏరియాల్లో థియేటర్లలో అద్భుతంగా రన్ అవుతోంది. రజనీకాంత్ స్టైల్ కు ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్.
ఇక ఇన్ని లాభాలు రావడంతో ఈసినిమా నిర్మాత కళానిది మారణ దిల్ ఖుష్ అయ్యారు. రజనీకాంత్ తో పాటు.. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కోట్ల విలువ చేసే కార్లతో పాటు.. లాభాలతో వాటాలు కూడా ఇచ్చారు. అంతే కాదు.. ఈసినిమా కోసం పనిచేసిన దాదాపు 300 మందికి కోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చారు కళానిధి మారన్. ఇక తాజాగా సన్ పిక్చర్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరో సినిమా తెరకెక్కిస్తున్నారు మారన్. లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.