రజనీకాంత్‌ తన అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన నటిస్తున్న `లాల్‌ సలామ్‌` నుంచి ఆయన ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. ఇది అద్యంతం పవర్‌పుల్‌గా ఉండటం విశేషం.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాను నటిస్తున్న సినిమాలో నుంచి ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో `లాల్‌ సలామ్‌` అనే సినిమా రూపొందుతుంది. ఇందులో రజనీకాంత్‌ ఓ ముఖ్య పాత్రపోషిస్తున్నారు. గెస్ట్ రోల్‌కి ఎక్స్ టెండెడ్‌గా రజనీ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. తాజాగా ఇందులోని ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. `లాల్‌ సలామ్‌` లో ఆయన మొయిదీన్‌ భాయ్‌గా కనిపించబోతున్నారు. 

విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో రజనీకాంత్‌ కుర్తా ధరించారు. ఎర్రని క్యాప్‌, బ్లాక్‌ గ్లాసెస్‌, నెరిసిన గెడ్డంతో మోస్ట్ స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా(ముంబయి) వద్ద బ్యాక్‌ గ్రౌండ్‌లో అల్లర్లు జరుగుతుండగా, అందులో నుంచి రజనీకాంత్‌ స్టయిల్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. చాలా రాయల్ గా కనిపిస్తున్నారు. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, ఓ డాన్‌ తరహా పాత్రలో కనిపించబోతున్నారని ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. `బాషా` చిత్రంలో మాణిక్‌ బాషాగా అలరించిన ఆయన ఇప్పుడు మొయిదీన్‌గా అదరగొట్టేందుకు వస్తున్నారు.

ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా కనిపిస్తారని తెలుస్తుంది. లైకా సంస్థనిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఏఆర్‌ రెహ్మాన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం విడుదలైన రజనీకాంత్‌ ఫస్ట్ లుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

Scroll to load tweet…

ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ చిత్రాల‌ను అందించ‌టానికి మా లైకా ప్రొడ‌క్ష‌న్ష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. లాల్ స‌లాం విష‌యానికి వ‌స్తే ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్‌గారి దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌గారు మొయిదీన్ భాయ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయ‌న త‌న‌దైన స్టైల్‌లో రాకింగ్ పెర్ఫామెన్స్‌తో ఈ చిత్రంలోనూ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటార‌న‌టంలో సందేహం లేదు. . ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు’’ అని తెలిపారు.

ఇదిలా ఉంటే రజనీకాంత్‌ హీరోగా ప్రస్తుతం `జైలర్‌` చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌ వంటి వారు కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. ఇందులో రజనీకి జోడీగా తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదలయ్యే అవకాశం ఉంది.