రజనీకాంత్ ఈ ఏడాది పేట చిత్రంతో సందడి చేశాడు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ లో రజనీ పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

తరచుగా షూటింగ్ లొకేషన్స్ లోని పిక్స్ కొన్ని లీకవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ దర్బార్ షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. పోలీస్ డ్రెస్ లో రజనీ అదిరిపోయే లుక్ లో కూర్చుని ఉండగా.. తన భర్త భుజాలపై చేతులు వేసి ఫొటోకు పోజిచ్చారు లతా. ఈ రొమాంటిక్ పిక్ ప్రస్తుతం నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రంలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సర్కార్ లాంటి భారీ హిట్ తర్వాత మురుగదాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దర్బార్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.