అలాంటి చిత్రమైన పరిస్దితే ఇప్పుడు ఇక్కడ దిల్ రాజుకు, అక్కడ రజనీకాంత్ కు ఏర్పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకు కారణం బీస్ట్ సినిమా డిజాస్టర్ అవ్వటమే.
ఒక సినిమా హిట్ అయితే చాలా మందికి కలిసివస్తుంది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సంతోషాలతో ఉంటారు. అయితే సినిమా డిజాస్టర్ అయితే ... ఆ హీరోతో, డైరక్టర్ తో ఆల్రెడీ కమిటై నెక్ట్స్ ప్రాజెక్టు చేస్తున్న వాళ్లకు టెన్షన్ మామూలుగా ఉండదు. ప్రాజెక్టు కాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్లలేరు. మొదట ఉన్నంత ధైర్యంగా సినిమా చెయ్యనూ లేరు. అలాంటి చిత్రమైన పరిస్దితే ఇప్పుడు ఇక్కడ దిల్ రాజుకు, అక్కడ రజనీకాంత్ కు ఏర్పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుని కొట్టినవాళ్లు లేరు. అదే విధంగా రజనీకాంత్ సౌతిండియా సూపర్ స్టార్. ఆయనకు ఎదురులేదు. కానీ ఓ సినిమా ఈ ఇద్దరినీ ఒకేసారి టెన్షన్ లో పడేసింది. ఆ సినిమానే `బీస్ట్`. ఇది డిజాస్టర్ అవ్వటమే ఇప్పుడు ఇద్దరిని టెన్షన్ పెడుతుంది.
నిజం చెప్పుకోవాలంటే ..సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలంటే గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించడం లేదు. ఆయన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంలో విఫలమయ్యాయి. ఒకప్పుడు సౌత్ మొత్తం సంచలనం సృష్టించే ఆయన చిత్రాలు తమిళనాడులో కూడా వర్కవుట్ కావటం లేదు. ఆయన లాస్ట్ ఫిల్మ్ పెద్దన్న (‘అన్నాత్తే’) పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు సన్ పిక్చర్స్ కోసం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీ ఓ సినిమా చేయబోతున్నారు.
అయితే నెల్సన్ దర్శకత్వం వహించిన విజయ్ ‘బీస్ట్’. బీస్ట్ చిత్రం ఏమైందో మనకు తెలుసు. పెద్ద స్టార్‌ని హ్యాండిల్ చేసే సామర్థ్యం తనకు లేదని నెల్సన్ చూపించినట్లైంది. దాంతో నెల్సన్‌తో తన సినిమా ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు రజనీకాంత్‌కి కొత్త టెన్షన్. మరో ప్రక్క దిల్ రాజు ది అదే పరిస్దితి. `బీస్ట్` సినిమా తర్వాత విజయ్ తో ఆయన సినిమా చేస్తున్నారు. `బీస్ట్` డిజాస్టర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా మార్కెట్ లో ఉంటుంది.
అలాగే తనకు తమిళ మార్కెట్ కొత్త. తెలుగు రెండు రాష్ట్రాల్లో అంటే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడా `బీస్ట్` కు మినిమం కలెక్షన్స్ రాలేదు. దాంతో విజయ్ నెక్ట్స్ సినిమా అనేది ఎంతవరకూ బిజినెస్ చేయగలుగుతారు. తను పెట్టిన ఖర్చుని ఎంతవరకూ రికవరీ చేయగలరు అనేది ఖచ్చితంగా టెన్షన్ కలిగించే విషయమే. మొత్తానికి ఒక్క సినిమా ఈ ఇద్దరి ప్రశాంతతను చెడకొట్టిందనే చెప్పాలి.
