ఇండియన్ బిగ్ బడ్జెట్ మూవీ 2.ఓ గత ఏడాది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు వరల్డ్ వైడ్ గా రిలీజైన ఆ సినిమా చైనాలో మాత్రం రిలీజ్ కాలేదు. ఎప్పటినుంచో బయ్యర్లు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పటికీ వర్కవుట్ కావడం లేదు. 

మొత్తానికి ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని సెప్టెంబర్ 6న విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. అసలైతే జులై సెకండ్ వీక్ లోనే ఈ సినిమా చైనాలో రిలీజ్ కావాల్సింది. కానీ ద లయన్ కింగ్ మ్యానియా అప్పుడు డామినేట్ చేయడంతో రిస్క్ చేయకూడదని వాయిదా వేస్తూ వచ్చారు. మొత్తానికి వచ్చే నెల విడుదల కాబోతున్న ఈ సినిమా చైనాలో ఒక రికార్డ్ ను క్రియేట్ చేయబోతోంది. 

చైనాలో 47,000 కు పైగా 3డి స్క్రీన్ లలో 2.0 ప్రదర్శించబడనుంది. చైనాలో ఈ స్థాయిలో విడుదల అవుతున్న మొదటి విదేశీ చిత్రం ఇదే. రోబో సినిమా కూడా అప్పట్లో భారీ స్థాయిలో రిలీజయ్యి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో ఇప్పుడు 2.O కూడా హిట్టవుతుందని అంతా భావిస్తున్నారు. మరి సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ 450కోట్ల బారి బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే.