ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ చిత్రాలు తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి నిర్మాతలకు లాభాలు పండించేవి. ఇప్పుడు కూడా రాజేంద్రప్రసాద్ బిజీ ఆర్టిస్టే. అద్భుతమైన పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. 

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఓ బేబీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 

రాజేంద్ర ప్రసాద్ కొత్త తరం నటులతో కూడా కలసిపోయి నటిస్తున్నారు.. కొత్త తరం నటులతో రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ బాగా కుదురుతోంది అనే ప్రశంసలపై ఆయన స్పందించారు. ఇప్పుడున్నది కొత్త తరమే కావచ్చు.. కానీ వాళ్ళ ఆలోచనలతో మనం కనెక్ట్ అయితే చాలు.. అంతా సాఫీగా జరిగిపోతుంది అని తెలిపారు. 

నేను ఇండస్ట్రీలోకి రావడమే ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేశా. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరితో అయినా వర్క్ చేయగలరు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.. భవిష్యత్తులో విలన్ రోల్స్ చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. విలన్ రోల్స్ చేస్తే తప్పేముంది. 

ప్రస్తుతం జగపతి బాబు అద్భుతంగా నటిస్తున్నాడు కదా. కాకపోతే నన్ను ఎక్కువగా అభిమానించే వాళ్ళెవరికీ అలాంటి పాత్రలు నచ్చడం లేదు అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.