Asianet News TeluguAsianet News Telugu

ముదురుతున్న‘ఆదిపురుష్’ టీజర్ వివాదం.. స్పందించిన రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్.!

ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్ర టీజర్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా  రాజస్థాన్ మంత్రి స్పందించిన తీరు వివాదాలకు మరింత బలమిచ్చేలా ఉన్నాయి. 
 

Rajasthan Minister Pratap Singh responded to the Adipurush controversy!
Author
First Published Oct 10, 2022, 6:24 PM IST

హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి  డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తై రిలీజ్ కు సిద్ధంగా  ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ను ప్రారంభించింది. దసరాకు ముందుకు టీజర్ ను  రిలీజ్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి.

రామయాణంలోని పాత్రలను ‘ఆదిపురుష్’లో సరిగ్గా చూపించడం లేదని, హిందూ దేవుళ్లను కించపరిచేలా సినిమాను రూపొందిస్తున్నారని పలువురు బ్రహ్మాణులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడిని, రావణాసురుడిని, సీతమ్మను, హన్మంతుడిని చూపించిన తీరుపై మండిపడుతున్నారు.  ఇప్పటికే యూపీ,  పంజాబ్, తదితర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఓ న్యాయవాది కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. 

మరోవైపు హిందూ దేవుళ్లను మరియు దేవతలను బాలీవుడ్ సినిమాల్లో సరిగా చూపించడం లేదని ఆరోపిస్తూ ‘సనాతన్ సెన్సార్ బోర్డ్‌’ (Sanatan Censor Board)ను ఏర్పాటు చేయాలని హిందూ దార్శనికుల సంఘం అఖిల భారతీయ సంత్ సమితి ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై బ్రాహ్మణులు గట్టిగానే పోరాడుతున్నారు.  ఈ క్రమంలో  రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచార్యవాస్ (Pratap Singh) కూడా స్పందించడం ‘ఆదిపురుష్’ టీజర్ వివాదం మరింతగా ముదురుతోంది.  

మంత్రి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ..  సనాతన్ సెన్సార్ బోర్డు ఏర్పాటు కోసం హిందూ సాధువులు చేసిన డిమాండ్‌కు తన మద్దతు తెలుపుతున్నానన్నారు. సాధువులకు అండగా  నిలుస్తానని తెలిపారు.  సాధువుల డిమాండ్‌లను పరిశీలించి అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. సనాతన్ సెన్సార్ బోర్డ్‌ను రూపొందించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం మంత్రి కామెంట్స్ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. ఇన్ని అడ్డంకులను దాటుకొని ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి ఎలా వస్తుందో చూడాలంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios