గరుడవేగ సినిమాతో పాజిటివ్ సక్సెస్ అందుకున్న సీనియర్ యాక్టర్ రాజశేఖర్ రీసెంట్ గా మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు. యువ దర్శకుడైన ప్రశాంత్ వర్మతో కలిసి చేసిన డిఫరెంట్ మూవీ కల్కి ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. మొదట ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నప్పటికీ చివరికి కలెక్షన్స్ పరంగా ప్లాప్ అని తేలిపోయింది. 

అయితే నెక్స్ట్ మరో మంచి సినిమాతో హిట్టు కొట్టాలని రాజశేఖర్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నెక్స్ట్ ఒక కన్నడ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ్ ప్రొడ్యూసర్ ధనంజయ ఈ రీమేక్ ను తమిళ్ తెలుగులో ఒకేసారి నిర్మించనున్నారు. తమిళ్ వెర్షన్ లో సత్యరాజ్ తనయుడు సీబీ సత్యరాజ్ మెయిన్ లీడ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. 

అయితే వీరు రీమేక్ చేస్తోన్న ఆ కన్నడ కథను గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే రెండు భాషల్లో సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడిని ఫైనల్ చేసి సినిమా షూటింగ్ ని మొదలుపెట్టాలని నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా రాజశేఖర్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటారో చూడాలి.