Asianet News TeluguAsianet News Telugu

Rajasekhar: 'శేఖర్' సినిమాపై స్టే.. రాజశేఖర్ ఎమోషనల్ పోస్ట్,అందరినీ కదిలిస్తోంది

తనకు రాజశేఖర్ డబ్బులు ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఈ మూవీ స్క్రీనింగ్‌కు స్టే ఇచ్చింది. శేఖర్ సినిమా నిలిపివేతపై సోషల్ మీడియా వేదికపై  హీరో రాజశేఖర్ స్పందించాడు.

Rajashekar on Shekar Shows Get Cancelled
Author
Hyderabad, First Published May 23, 2022, 9:38 AM IST

రాజశేఖర్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గరుడ వేగ’ తో మళ్లీ ఫామ్‌లో వచ్చారు. ఆ తర్వాత కల్కితో మరోసారి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. తాజాగా ఈయన తన జీవిత భాగస్వామి జీవిత దర్శకత్వంలో తన పేరులో ఉన్న ’శేఖర్’ టైటిల్‌తో చేసిన ఈ మూవీతో వచ్చారు. ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. అయితే కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పికప్ అవుతాయనుకున్న టైమ్ లో పులి మీద పుట్రలా ఈ సినిమా ఆపేయమంటూ స్టే వచ్చింది. 

ఈ సినిమా ఫైనాన్షియర్ తనకు రాజశేఖర్ డబ్బులు ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఈ మూవీ స్క్రీనింగ్‌కు స్టే ఇచ్చింది. శేఖర్ సినిమా నిలిపివేతపై సోషల్ మీడియా వేదికపై  హీరో రాజశేఖర్ స్పందించాడు.

 'నాకు, నా కుటుంబానికి శేఖర్ సినిమానే అన్నీ. ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం. శేఖర్‌కు మంచి స్పందన లభిస్తోంది కానీ ఈరోజు కొందరు మోసం చేసి మూవీ స్క్రీనింగ్‌ను నిలిపివేశారు. సినిమానే మా జీవితం. ముఖ్యంగా ఈ సినిమా మా ఆశ. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు.' అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు రాజశేఖర్.

 శేఖర్' సినిమా కోసం తన వద్ద దర్శకురాలు జీవితా రాజశేఖర్ రూ.65 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదని ఎ.పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆదివారం సాయంత్రంలోగా రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ డిపాజిట్ చేయలేకపోతే 'శేఖర్' సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్‌మెంట్ చేస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇచ్చిన గడువులోగా జీవితా రాజశేఖర్ డబ్బులు చెల్లించకపోవడంతో 'శేఖర్' నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
 
రాజశేఖర్ మాట్లాడుతూ... "శేఖర్ కి ముందు మాకు కొన్ని ప్రాపర్టీస్ ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. ఒకవేళ సినిమా కనుక సరిగా ఆడక పోతే మాకు మిగిలేది కేవలం అప్పులు మాత్రమే. కానీ ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ప్రేక్షకులందరికీ సినిమానీ కచ్చితంగా థియేటర్లలోనే చూడమని నేను విన్నవించుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు రాజశేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసఫ్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. 

 ప్రపంచవ్యాప్తంగా టోటల్ బిజినెస్ విషయానికి వస్తే..3.25 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది.  చాలా ఏరియాలలో ఈ చిత్రాన్ని ఓన్ గా రిలీజ్ చేసారు నిర్మాతలు. ఇక ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపుగా రూ 4 కోట్లు అయినా రాబట్టాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 300 థియేటర్లకు పైగా విడుదలైంది.  దాంతో రాజశేఖర్ ఈ సినిమా తో బయట పడతారా లేదా అన్న విషయమై ట్రేడ్ లో చర్చ జరుగుతోంది.  ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే కొద్దిరోజుల ముందే రాజశేఖర్ కి కరోనా సోకింది.

Follow Us:
Download App:
  • android
  • ios