మహేష్ బాబు ఇంటికి రాజమౌళి, నేడే ఫైనల్.. నిజమా ఫేకా ?
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథని తన తండ్రితో కలసి రాజమౌళి ప్రిపేర్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే మహేష్ అభిమానులంతా ఆయన తదుపరి చిత్రం కోసమే ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథని తన తండ్రితో కలసి రాజమౌళి ప్రిపేర్ చేస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఇది ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు అడ్వెంచర్ డ్రామా అని చెబుతూ వచ్చారు. అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుందట. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు మహేష్, రాజమౌళి మూవీ ప్రారంభం కాలేదు. ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా క్లారిటీ లేదు.
కానీ నిన్నటి నుంచి మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయి. నేడు రాజమౌళి మహేష్ ఇంటికి వెళ్లనున్నారని.. తమ చిత్రానికి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ నిజక్కన్న రాజమౌళికి నేరేట్ చేస్తారని వార్తలు వచ్చాయి. సినిమా ప్రారంభం గురించి చర్చించుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మహేష్ టీం నుంచి సమాచారం. మహేష్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులో గుంటూరు కారం షెడ్యూల్ లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. రాజమౌళి స్క్రిప్ట్ నేరేట్ చేయబోతున్నట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని అంటున్నారు. రాజమౌళితో మీటింగ్ లాంటి షెడ్యూల్ లేదని అంటున్నారు.