అమరావతికోసం రాజమౌళిని రంగంలోకి దింపుతున్న చంద్రబాబు లండన్ లో జరిగే సర్వేకు రాజమౌళిని తీసుకెళ్లనున్న ఏపీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ఈ 30న నార్మన్ పోస్టర్ ఆర్కిటెక్ట్స్ తో సమావేశం

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొట్టి తెలుగు సినిమా స్నటామినాను ప్రపంచానికి చాటిన చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని లండన్ తీసుకువెళ్లేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారుల బృందం సెప్టెంబర్ 30వ తేదీన రాజమౌళిని లండన్ తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న పలు ముఖ్యమైన కట్టడాల డిజైన్స్ కోసం లండన్‌లోని ఫేమస్ ఆర్కిటెక్ట్స్ నార్మన్ ఫోస్టర్ సహాయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.



తాజాగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ అయిన అనంతరం పలు కార్యాలయాల నిర్మాణంలో మరిన్ని హంగులు, అత్యాధునిక డిజైన్స్ అవసరం అని భావించిన సీఎం చంద్రబాబు.. ఈ నెలాఖరున రాజమౌళిని లండన్‌కి వెంట తీసుకెళ్లి అక్కడ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. గతంలోనూ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాజమౌళి పలుసార్లు సీఆర్డీఏ అధికారులతో భేటీ సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే.