దర్శకధీరుడు రాజమౌళి.. ప్రభాస్, రానాలతో కలిసి బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలో రాజమౌళి.. ''సౌత్ సూపర్ స్టార్స్ కి ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో తెలుసు. వారికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అటువంటి సినిమాలే డెలివర్ చేస్తుంటారు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ మాదిరి కాదు'' అని కరణ్ జోహార్ తో చెప్పగా.. దానికి కరణ్ వెంటనే 'అవును' అంటూ రాజమౌళి మాటలను సపోర్ట్ చేశాడు.

రాజమౌళి చేసిన కామెంట్స్ తో బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాజమౌళి కాకుండా అక్కడ మరే దర్శకుడు ఉన్నా.. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద రచ్చ జరిగేది. కానీ రాజమౌళి లాంటి దర్శకుడిని కామెంట్ చేయలేని బాలీవుడ్ సూపర్ స్టార్లు గమ్మునుండిపోయారట.

కానీ ఈ విషయంపై కరణ్ జోహార్ దగ్గర కంప్లైంట్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, రణవీర్, అజయ్ దేవగన్ ఇలా చాలా మంది హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా రాబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అలాంటిది వారి గురించి రాజమౌళి నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు సూపర్ స్టార్లు.. రాజమౌళిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ కామెంట్స్ ని రాజమౌళి వెనక్కి తీసుకుంటాడో లేదో చూడాలి!