Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళితో నాగార్జున సినిమా..? కింగ్ అడిగితే జక్కన్న ఏమన్నాడంటే...?

కింగ్ నాగార్జున తో సినిమా చేయబోతున్నారట రాజమౌళి.. మరి ఈ సినిమా ఎప్పుడు...? కథేంటి..? అసలు ఇందులో నిజమెంత..? టాలీవుడ లో వినిపిస్తున్న మాటేంటి... నాగార్జున్ అడిగితే రాజమౌళి ఏమన్నారు..?
 

Rajamouli Movie with Tollywood King Nagarjuna
Author
First Published Sep 20, 2022, 6:51 AM IST

రాజమౌళితో సినిమా కోసం ఇండియాలోని అన్ని భాషల్లో అందరు స్టార్ హీరోలు ఎదురుచూస్తుంటారు. హీరోగా కాకపోయినా.. ఆయన సినిమాలో గెస్ట్ రోల్ వచ్చినా చాలు.. పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవచ్చు..కొత్త ఇమేజ్ సాధించ్చవచ్చు అనుకుంటారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ ,కోలీవుడ్ స్టార్లు జక్కన్నతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.. ఆలిస్ట్ లో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా వచ్చి చేరారు. ఇంతకీ.. నాగ్ తో రాజమౌళి సినిమా ఎప్పుడు..?

బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిప దర్శకుడు రాజమౌళి.  తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి  గుర్తింపు తీసుకొచ్చారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ హడావిడి అయిపోవడంతో...  ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాపై వర్కౌట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ పాత్రలో నాగార్జున కనిపిస్తారని రూమర్స్ వినిపించాయి.. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదు అంటున్నాయి.. సినీ వర్గాలు. అయితే నాగార్జునతో జక్కన్న సపరేట్ గా సినిమా ప్లాన్ చేస్తున్నారా...? 

రాజమౌళితి సినిమా చేయాలి అని ఇండస్ట్రీలో ఉన్న  ప్రతి హీరో, హీరోయిన్ చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్.. జూనియర్ ఆర్టిస్ట్ కూడా అనుకుంటారు. తాజాగా ఆలిస్ట్ లోకి  కింగ్ నాగార్జున కూడా చేరారు..  రాజమౌళితో సినిమా గురించి రీసెంట్ గా ఆయన  మాట్లాడాడు. నాగార్జున ఈ దసరాకి ఘోస్ట్ సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో సాధించడంతో బాలీవుడ్ లో సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ సక్సెస్ మీట్ లో నాగార్జునని రాజమౌళితో సినిమా ఎప్పుడు చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

దీనికి నాగార్జున మాట్లాడుతూ.. రాజమౌళితో సినిమా చేసే సమయం వస్తే అది సాధ్యమవుతుంది. నాతో సినిమా తీయమని రాజమౌళిని అప్పుడప్పుడు అడుగుతుంటూనే ఉంటాను. కానీ ప్రతిసారీ ఆయన చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. రాజమౌళి కథని నమ్మే దర్శకుడు. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక దానికి తగ్గ నటుల్ని వెతుక్కుంటారు. మరి ఆయన కథలకి నేనెప్పుడూ సరిపోతానో, ఆ సమయం వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే  అని చెప్పారు. ఇండైరెక్ట్ గా రాజమౌళి ఓకే అంటే సినిమా చేయడానికి నాగార్జున రెడీగా ఉన్నాడని చెప్పేశారు. అవసరమైతే తానే నిర్మాతగా కూడా ఉండటానికి రెడీగా ఉన్నాడు నాగ్.

Follow Us:
Download App:
  • android
  • ios