SSMB29:బిగ్ అప్డేట్.. రాజమౌళి, మహేష్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఫిక్స్, సెంథిల్ కుమార్ ఎందుకు దూరం అంటే..
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. తాజాగా ఒక బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అది ఈ చిత్రానికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ గురించి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే మహేష్ అభిమానులంతా ఆయన తదుపరి చిత్రం కోసమే ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథని తన తండ్రితో కలసి రాజమౌళి ప్రిపేర్ చేస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఇది ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు అడ్వెంచర్ డ్రామా అని చెబుతూ వచ్చారు. అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుందట. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు మహేష్, రాజమౌళి మూవీ ప్రారంభం కాలేదు. అయితే ఎట్టకేలకు మహేష్, రాజమౌళి మూవీ పనులు మొదలైనట్లు తెలుస్తోంది.
తాజాగా ఒక బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అది ఈ చిత్రానికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ గురించి. రాజమౌళి సినిమా అంటే 90 శాతం సెంథిల్ కుమార్ సినిమా తో గ్రాఫర్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. కానీ మహేష్, రాజమౌళి చిత్రానికి సెంథిల్ కుమార్ కెమెరామెన్ కాదట. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే మహేష్ చిత్రానికి పీఎస్ వినోద్ ని రాజమౌళి సినిమాటోగ్రాఫర్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన బలమైన కథనాలు వెలువడుతున్నాయి. సినిమా టోగ్రాఫర్ గా పీఎస్ వినోద్ ఫిక్స్ అని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లోగా జక్కన్న స్క్రీన్ ప్లే లాక్ చేయనున్నారట. పీఎస్ వినోద్ ఎక్కువగా త్రివిక్రమ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రానికి కూడా అతడే సినిమాటోగ్రాఫర్.
అయితే సెంథిల్ కుమార్ ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం.. సెంథిల్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. దానికోసం ప్రిపరేషన్ లో ఉన్నారని కాబట్టే రాజమౌళి, మహేష్ చిత్రానికి అందుబాటులో లేరని అంటున్నారు. ఎప్పటి నుంచో SSMB29 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి సినిమాటోగ్రాఫర్ వార్త క్రేజిగానే ఉంటుంది.