కన్నడ మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. 

కన్నడ మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. 

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, కన్నడ మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమా శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వారాహి చలనచిత్ర పతాకంపై తెలుగు–కన్నడ భాషల్లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ నాట మాయాబజార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈసినిమాను తెరకెక్కించబోతున్నారు. 

ఈ మూవీలో హీరోయి గా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల నటిస్తుండగా కన్నడ కన్నడ స్టార్‌ రవిచంద్రన్‌, జెనీలియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి లాంటి అద్భుతాల సృస్టించిన సెంథిల్ సినిమాటోగ్రఫర్ గా ఈ సినిమాకు పని చేయబోతున్నారు. యాక్షన్ సీన్స్ ను ఫీటర్ హిల్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. 

ఇక శుక్రవారం ఘనంగా జరిగిన సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో కన్నడ సీనియర్ నటుడు రవిచంద్రన్ వి. కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్లాప్‌ కొట్టారు. కిరీటి ఎంట్రీ గురంచి రాజమౌళి మాట్లాడుతూ.. కిరీటిని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తన లుక్స్‌ చాలా బాగున్నాయి. నటుడికి కావాల్సిన అన్ని అర్హతలు కిరీటిలో ఉన్నాయన్నారు. నటన, డ్యాన్స్, ఫైట్స్‌ అన్నీ కిరీటి బాగా చేయగలడు. వారాహి బేనర్‌లో కిరీటి సినిమా చేయడం ఆనందంగా ఉంది అన్నారు జక్కన్న. 

జెనీలియా నటనకు దూరమయ్యి దాదాపు పదేళ్ళు అవుతుంది. నటుడు నిర్మాత రితీష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడి..వెండితెరకు దూరం అయిన ఈబ్యూటీ.. ఇన్నాళ్లకు ఈసినిమాతో మరోసారి తేరంగేట్రం చేస్తుంది. ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్న జెనీలియా ఓపెనింగ్ కార్యక్రమలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన హీరోయిన్ నేను నటనకు దూరమై పదేళ్లయింది. కిరీటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాను .. చాలా సంతోషంగా ఉందన్నారు. 

హీరో కావాలన్న తన కల నేరవేరుతున్నందకు చాలా సంతోషంగా ఉంది అన్నారు కిరీటి. తాను సినిమాల్లోకి రావడానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ స్ఫూర్తి అన్నారు కిరీటి. ఈసినిమా యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది అన్నారు కిరీటి. ఇక నుంచి రెగ్యూలర్ షూటింగ్ కు వెళ్శబోతున్న ఈమూవీనీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.