రంగస్థలం చిత్రంపై, రాంచరణ్ నటనపై దర్శక ధీరుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం ఆర్ఆర్ఆర్ టీం దుబాయ్ లో సందడి చేసి వచ్చింది. నేడు కర్ణాటకలో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆర్ఆర్ఆర్ టీం రెడీ అవుతోంది. 

దుబాయ్ లో జరిగిన మీడియా సమావేశంలో రాజమౌళి ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య తేడా వివరించారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. నేను ఏం ఆశిస్తున్నానో ఎన్టీఆర్ కి తెలుసు. ఎన్టీఆర్ ఎలా నటిస్తాడో నాకు తెలుసు. ఎన్టీఆర్ విషయంలో నాకు ఎప్పుడూ పెద్దగా సర్ ప్రైజ్ లేదు. ఎన్టీఆర్ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ చరణ్ విషయానికి వచ్చే సరికి అది పూర్తిగా డిఫెరెంట్. 

'మగధీర' ఆ టైంలో నా కెరీర్ లో, రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ. ఆ చిత్రం తర్వాత కూడా రాంచరణ్ అద్భుతమైన నటుడు అని నాకు అనిపించలేదు. కానీ రంగస్థలం చూశాక నా మైండ్ బ్లాక్ అయింది. రాంచరణ్ ఇంత అద్భుతంగా ఎలా చేశాడు అనిపించింది. 

రాంచరణ్ లో రంగస్థలం లాంటి నటుడు కూడా ఉన్నాడని నాకు మగధీర టైం లో తెలియదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి వచ్చే సమయంలో కూడా రాంచరణ్ వైట్ బ్లాంక్ పేపర్ లా వస్తాడు. నా నుంచి మీకు ఏం కావాలో చేసుకోండి అని డైరెక్టర్ కి చెబుతాడు అంటూ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. నేడు ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మరిన్ని విశేషాలు తెలియనున్నాయి. ఈ చిత్ర రన్ టైం 3 గంటలు పైగా ఉండనుండడం విశేషం.