మహా భారతాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఒక అద్భుత దృశ్య కావ్యంగా, విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే కోరిక ఉన్నట్లు రాజమౌళి ఇప్పటికే పలు సందర్భాల్లో తన కోరిక బయట పెట్టారు. 

దర్శకధీరుడు రాజమౌళి తన విజన్ తో మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాలు ఆవిష్కరించారు. జక్కన్న మిగిలిన చిత్రాలు కూడా హిట్సే. అయితే మహా భారతాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఒక అద్భుత దృశ్య కావ్యంగా, విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే కోరిక ఉన్నట్లు రాజమౌళి ఇప్పటికే పలు సందర్భాల్లో తన కోరిక బయట పెట్టారు. 

అయితే ఎప్పుడు ఎలా అనే విషయాలని జక్కన్న రివీల్ చేయలేదు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా వర్క్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి అదిరిపోయే కామెంట్స్ చేశారు. 

భారతీయ ఇతిహాసం మహాభారతాన్ని తెరకెక్కించేందుకు తన వద్ద కొన్ని ప్లాన్స్ ఉన్నాయని రాజమౌళి లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అయితే ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఇంకా నిర్ణయించుకోలేరు అని రాజమౌళి తెలిపారు. మహాభారతాన్ని ఇప్పటికే అనేక వందల ఎపిసోడ్స్ లో బుల్లితెరపై ఆవిష్కరించారు. 

సిల్వర్స్ స్క్రీన్ పై ఎవరికి తోచిన విధంగా వారు అనేక భాగాలు ఆవిష్కరించారు. కానీ మహాభారతాన్ని ఎన్ని సార్లు చూసిన, విన్నా అద్భుతంగానే ఉంటుంది. మహాభారతం ఎంతో పెద్ద కథ, చాలా సంకిష్టమైనది. ప్రతి చిన్న పాత్రకి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి కథని ఆవిష్కరించాలంటే 10 భాగాలలో తెరకెక్కించాలి అని రాజమౌళి అన్నారు. 

మహాభారతం విషయంలో తన మైండ్ లో విజన్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలా చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేరు అని రాజమౌళి తెలిపారు. ఇక మహేష్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచం మొత్తం తిరిగే సాహసికుడి ఫారెస్ట్ అడ్వెంచర్ గా మహేష్, రాజమౌళి చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.