ఇప్పుడు రాజమౌళీ నుంచి మరో మల్టీస్టారర్‌ రాబోతుందనే వార్త ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే ఇండియాలోనే దీన్ని మించిన మల్టీస్టారర్‌ లేదని అంటున్నారు నెటిజన్లు.  

రాజమౌళి(Rajamouli).. అంటే పర్‌ఫెక్షన్‌. చెక్కిన శిల్పంలా ఆయన సినిమాలుంటాయి. క్వాలిటీ విషయంలో రాజీపడరు. పర్‌ఫెక్షన్‌ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే ఆయన జక్కన్న అయ్యారు. దర్శకుల్లో మిస్టర్‌ పర్ ఫెక్ట్ అయ్యారు. తాజాగా ఆయన చెక్కిన శిల్పం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. ఈ మల్టీస్టారర్‌ చిత్రం సుమారు రూ. 480కోట్లతో రూపొందింది. భారీ స్థాయిలో ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో విడుదల కాబోతుంది. సినిమా ఆడియెన్స్ ని జనంలోకి తీసుకెళ్లేందుకు దేశ వ్యాప్తంగా ప్రచారాలు చేస్తున్నారు యూనిట్‌. 

ఈ సినిమా తర్వాత రాజమౌళి.. మహేష్‌(Mahesh)తో సినిమా చేస్తున్నారు. ఇందులో బాలయ్య మరో పాత్ర పోషిస్తున్నారనే వార్త వినిపించిన నేపథ్యంలో అది మల్టీస్టారర్‌ కాదని తేల్చేశారు రాజమౌళి. మరోవైపు బన్నీతోనూ ఓ సినిమా అనుకుంటున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. కానీ ఇందులోనూ నిజం లేదని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళీ నుంచి మరో మల్టీస్టారర్‌ రాబోతుందనే వార్త ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే ఇండియాలోనే దీన్ని మించిన మల్టీస్టారర్‌ లేదని అంటున్నారు నెటిజన్లు. 

మరి రాజమౌళి చేయబోతున్న ఆ మల్టీస్టారర్‌ ఏంటీ? ఆయన దీనిపై ఏం చెప్పారనేది చూస్తే, ప్రస్తుతం రాజమౌళీ `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. క్షణం గ్యాప్‌ లేకుండా పర్‌ఫెక్ట్ గా ప్రమోషన్‌ ప్లాన్‌ చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో కలిసి ఇప్పటికే ఆయన దుబాయ్‌, కర్నాటక, ఢిల్లీ, జైపూర్‌, వారణాసి, కోల్‌కతా వంటి సీటీలను కవర్‌ చేశారు. బుధవారం వరకు ప్రమోషన్‌లో పాల్గొనబోతున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌కి చేరుకుని ఇక్కడ ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

అయితే ఈ ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో తమిళ హీరోలతో మల్టీస్టారర్‌ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారనే ప్రశ్న ఎదురైంది. దీనిపై రాజమౌళి స్పందిస్తూ, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth), లోక నాయకుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan)లతో సినిమా చేయాలనుందని వెల్లడించారు. `కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది. రజనీకాంత్‌ విలన్‌గా, కమల్‌ హీరోగా చేసినా ఫర్వాలేదు. ఇది చాలా సార్లు నా మైండ్‌లో మెదులుతుంటుంది. పూర్తి కథ లేదు కానీ అలా వారిద్దరిని చూడాలని ఓ అభిమానిగా వారితో అలాంటి సినిమా చేయ్యాలని ఉంది` అని తెలిపారు రాజమౌళి. ఇదే నిజమై, పట్టాలెక్కితే ఆ సినిమా రేంజ్‌ని, ఆ మానియా ఊహకందని విధంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.